Home » Medchal–Malkajgiri
రాష్ట్రవ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వానకు ప్రజలు వణికిపోయారు. గాలివాన తీవ్రత ఉమ్మడి పాలమూరులో ఎక్కువగా ఉంది..! నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలి నలుగురు మృతి చెందారు.
బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. మొన్నటికి మొన్న సుచిత్రలోని భూ వివాదం తాలూకు కాక చల్లారకముందే తాజాగా బొమ్మరాసిపేట గ్రామ పరిధిలోని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఆయన అక్రమంగా నిర్మించిన ప్రహరీ తెరమీదకొచ్చింది.
‘మాజీ మంత్రి మల్లారెడ్డి పాలు, పూలు అమ్ముడే కాదు.. భూ కబ్జాలు కూడా చేస్తుండు. ఆయన పేరే భూ కబ్జాల మల్లారెడ్డి. ఆయన కబ్జా చేసిన మా భూమిని మాకు ఇప్పించాలి. మల్లారెడ్డి తన తప్పు ఒప్పుకుని మాకు క్షమాపణ చెప్పి, పదవికి రాజీనామా చేయాలి’ అని బాధితుడు సేరి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల రెవెన్యూ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలోని 1.11 ఎకరాల భూ వివాదంలో గొడవకు సంబంధించి బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని.. ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. సర్వేనంబరు 82, 83లోని ఈ భూమి మాది అంటూ శ్రీనివాస్ రెడ్డి, మరో 15 మంది కలిసి శనివారం తెల్లవారుజామున కోర్టు పత్రాలను వెంటబెట్టుకొని వచ్చారు.
సుచిత్ర భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy), ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి (MLA Rajasekhar Reddy) లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని పేట్ బషీరాబాద్ పీఎస్‌కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.
మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ 15 మంది మధ్య భూ వివాదం తారా స్థాయికి చేరింది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
జిల్లాలోని దుండిగల్ పీఎస్ పరిధిలో చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ల్యాప్‌టాప్‌లు దొంగిలించి వాటిని యాప్‌ల ద్వారా విక్రయిస్తున్నారు. నిందితుల్లో ఒకరు ఇంజనీరింగ్ విద్యార్థి కావడం గమనార్హం.
భారతీయ జనతా పార్టీ (BJP) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా పన్నాల హరీశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియమకానికి సంబంధించి శనివారం పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది.
Telangana: మేడ్చల్ జాతీయ రహదారి కొంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లారీ - భైక్ ఢీకొన్న ఘటనలో అయ్యప్పస్వామి మాలధారణ వ్యక్తి మృతి చెందారు.
తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి హెచ్ఎండీఏ (HMDA) సన్నాహాలు చేస్తోంది. మార్చి 1 నుంచి 39 ప్లాట్ల విక్రయానికి ఈ-వేలం వేయనున్నారు.