Home » Medigadda Barrage
మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకులో చేపట్టిన తాత్కాలిక మరమ్మతు పనులు చివరి దశకు చేరుకున్నాయి. గ్రౌటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకోగా షీట్ పైల్స్ అమరిక పనులు పూర్తికావస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేపట్టిన తొందరపాటు చర్యలేబ్యారేజీలను దెబ్బతీశాయా? అవసరమైన సర్వేలు నిర్వహించి, నిర్ధారిత ప్రమాణాలను జాగ్రత్తగా పాటిస్తూ పదేళ్ల సమయంలో నిర్మించాల్సిన ప్రాజెక్టును కేవలం మూడేళ్ల వ్యవధిలోనే హడావుడిగా పూర్తి చేయడమే బ్యారేజీల కుంగుబాటుకు కారణమా?
గోదావరి-కావేరి నదుల అనుసంధానంలో ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ/రిజర్వాయర్ నిర్మిస్తామని ఇంతకాలం పట్టుబట్టిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఒక మెట్టు దిగింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి సబ్ కాంట్రాక్టర్ల వివరాలు సేకరించాలని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ నిర్ణయించింది. ఇందుకోసం ఆయా నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాన్ని నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని గత ప్రభుత్వం తమపై ఒత్తిడి చేసిందని నిర్మాణ సంస్థలు తెలిపాయి. ఆ ఒత్తిడితో నిర్మించడం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయని పేర్కొన్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్లో (Kaleswaram project) జరిగిన అవకతవకలపై చంద్ర ఘోష్ కమిటీ (Justice Chandra Ghosh) విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణను వేగవంతం చేసింది. ప్రాజెక్ట్ను ఇప్పటికే చంద్ర ఘోష్ కమిటీ సందర్శించారు.
వానాకాలంలో అన్నారం బ్యారేజీలో నీటిని నిల్వ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు కెమికల్ గ్రౌటింగ్, సిమెంట్ అడ్మిక్చర్ గ్రౌటింగ్ పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై న్యాయ విచారణ ప్రక్రియ సోమవారం నుంచి ఊపందుకోనుంది. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ విచారణ జరుపుతున్న సంగతి విదితమే.
మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్-7లో సీఎ్సఎంఆర్ఎ్స(సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) బృందం పరీక్షలు నాలుగో రోజైన శనివారం కూడా కొనసాగాయి. కుంగిన ప్రతి పిల్లరుతోపాటు గేట్ల ముందున్న బే ఏరియాల్లో డ్రిల్లింగ్ చేపడుతున్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నిర్ణీత వ్యవధిలోగా మరమ్మతులు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. మరమ్మతు పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.