Home » Medigadda Barrage
Telangana: జస్టిస్ చంద్ర గోష్ కమిషన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. నేటి నుంచి బ్యారేజీలపై కమిషన్ విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటిరోజు కావడంతో కమిషన్‌ను మంత్రి ఉత్తమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్ర గోష్ కమిషన్‌కు కాళేశ్వరం అంశాలను వివరించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను మంత్రి విజ్ఞప్తి చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని(Kaleswar Project) మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగుబాటుకు గల కారణాలను అన్వేషిండానికి వీలుగా బ్యారేజీ దిగువ భాగంలోనూ సాంకేతిక పరీక్షలు(Technical Tests) నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బ్యారేజీల్లోని అన్ని బ్లాకుల్లో..
కరీంనగర్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డలో రెండే పిల్లర్లు కుంగాయాని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వివరాలు అడిగిన నిపుణుల కమిటీ సభ్యులకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఎన్డీఎస్ఏ చీఫ్ చంద్రశేఖర్ అయ్యర్ ఆఫీసర్లపై సీరియస్ అయ్యారు.
Telangana: ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ శనివారం జలసౌధకు చేరుకుంది. రెండు రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లను కమిటీ పరిశీలించనుంది. ఈరోజు నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులతో కమిటీ ఎన్డీఎస్ఏ బృందం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి 2016 నుంచి ఆనకట్టల బాధ్యతల్లో ఉన్న ఇంజనీర్లు అందరూ హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటుపై అధ్యయనానికి ఎన్డీఎస్ఏ కమిటీకి పూర్తి సహకారం ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన కుంగిపోయిందని.. ఈ విషయాలను ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి వివరించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. బుధవారం నాడు సచివాలయంలో నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage) వ్యవహారంపై హైకోర్టు సోమవారం నాడు విచారణ చేపట్టింది. బ్యారేజ్ కుంగడంపై జుడిషియల్ విచారణను ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వం కోరింది.
మేడిగడ్డ బ్యారేజీలోని 86 పిల్లర్లలో ఒకటి కుంగిపోతే కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. శుక్రవారం నాడు మేడిగడ్డ బ్యారేజీని బీఆర్ఎస్ బృందం సందర్శించింది. కుంగిన పిల్లర్ నెంబర్ 20ని కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు.
మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage)ను సందర్శించడానికి బీఆర్ఎస్(BRS) పార్టీ శుక్రవారం నాడు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రాజెక్టు దగ్గరకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు.