Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:29 PM
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు అదిరిపోయే న్యూస్. రైళ్ల ప్రయాణవేళలు పొడిగిస్తున్నట్లు మెట్రో కీలక నిర్ణయం ప్రకటించింది. ఇప్పటి వరకూ రాత్రి 11 గంటలకే వరకే చివరి మెట్రో రైలు ఉండేది. కానీ, మార్చి 22 నుంచి కొత్తగా ప్రకటించిన టైమింగ్స్ అమల్లోకి రానున్నాయి.

Hyderabad Metro Rail Timings : హైదరాబాద్ మెట్రో ప్యాసింజర్లకు శుభవార్త. మార్చి 22 నుంచి రైలు ప్రయాణ వేళలను పొడిగిస్తున్నట్లు మెట్రో కీలక ప్రకటన చేసింది. ఇన్నాళ్లూ చివరి రైలు 11 గంటల వరకే ఉండేది. ఇప్పుడా సమయాన్ని మరో గంట పెంచింది. అంటే ఇప్పటినుంచి లాస్ట్ ట్రైన్ రాత్రి 12 గంటల 15 నిమిషాలకు బయలుదేరి 1:10 నిమిషాలకు గమ్యస్థానం చేరుకుంటుంది. ఐపీఎల్-2025 సీజన్ ప్రారంభం కావడంతో ఈ మార్పులు చేస్తున్నట్లు హైదరాబద్ మెట్రో రైలు యాజమాన్యం ప్యాసింజర్స్ కోసం ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే, ఈ సౌలభ్యం కేవలం ఈ మెట్రో లైన్లలోనే అందుబాటులో ఉంటుంది. ఎక్కడెక్కడంటే..
ఐపీఎల్ 2025 సీజన్ మొదలైన నేపథ్యంలో ప్యాసెంజర్ల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు వేళల్లో మార్పులు చేసింది. మార్చి 22 నుంచి మొదలుకుని ఐపీఎల్ సీజన్ పూర్తయ్యేవరకూ రైలు సమయాన్ని గంటపాటు పెంచింది. ఉప్పల్ స్టేడియం మ్యాచ్ చూసిన తర్వాత ప్రేక్షకులు ఉప్పల్ స్టేడియం, నాగోల్, ఎన్‌జీఆర్ఐ స్టేషన్‌లలో రాత్రి 12 గంటల 15 నిమిషాలకు చివరి రైలు ఎక్కవచ్చు. ఆయా మార్గాల్లో ప్రయాణించే సాధారణ ప్యాసింజర్లకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
హైదరాబాద్ మెట్రో వినిపించిన శుభవార్త క్రికెట్ అభిమానుల గుండెల్లో ఆనందం నింపుతోంది. ఆర్థరాత్రి సమయంలో ఇంటికి త్వరగా చేరుకునేందుకు అవకాశం చిక్కిందని క్రికెట్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 సీజన్లో రెండో మ్యాచ్ జరిగేది ఉప్పల్ స్టేడియంలోనే కావడం విశేషం. ఆదివారం (మార్చి 23న) సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి.
Read Also : GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Elevator: ఇలా చేస్తే.. లిఫ్ట్ ప్రమాదాల నుంచి ఈజీగా బయటపడొచ్చు..