Share News

TGSRTC And Metro: క్రికెట్ లవర్స్‌కు RTC, మెట్రో స్పెషల్ ఆఫర్స్..

ABN , Publish Date - Mar 27 , 2025 | 03:46 PM

TGSRTC And Metro Offers For IPL: క్రికెట్ అభిమానులకు ఊరించే ఆఫర్ ప్రకటించించాయి TGSRTC, హైదరాబాద్ మెట్రో యాజమాన్యాలు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగిన ప్రతిసారీ ఫ్యాన్స్ కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుండగా.. మెట్రో కూడా ట్రైన్ టైమింగ్స్ పెంచింది.

TGSRTC And Metro: క్రికెట్ లవర్స్‌కు RTC, మెట్రో స్పెషల్ ఆఫర్స్..
TGSRTC And Metro IPL Special

TGSRTC And Metro Special Offers For IPL: ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ మ్యాచ్ ఎప్పుడెప్పుడూ జరుగుతుందా అని ఎదురుచూస్తారు హైదరాబాద్ క్రికెట్ లవర్స్. ఆకాశమే హద్దుగా తమ అభిమాన క్రికెటర్స్ ఫోర్లు, సిక్సులతో ప్రత్యర్థి జట్టును దంచికొడుతుంటే ప్రత్యక్షంగా చూడాలని నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి పెద్ద ఎత్తున తరలివస్తారు. అందుకే ప్రేక్షకుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని మ్యాచ్ ముగిసిన తర్వాత సురక్షితంగా ఇంటికి చేరేందుకు TGSRTC, మెట్రోలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అభిమానుల కోసం ఆర్టీసీ 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను నడపుతుంటే.. మెట్రో చివరి రైలు సమయాన్ని గంట పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.


టీజీఎస్​ఆర్టీసీ హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు తీపి కబురు అందించింది. ఉప్పల్ స్టేడియంలో IPL మ్యాచ్ జరిగిన ప్రతిసారీ స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. మ్యాచ్ జరిగిన రోజున అభిమానులు ఎలాంటి కంగారు లేకుండా ప్రశాంతంగా ఇంటికి చేరుకునేందుకు నగరంలోని వివిధ డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులు నడపనుంది.


ఈ తేదీల్లో స్పెషల్ బస్సులు..

IPL 2025 సీజన్‌లో షెడ్యూల్ ప్రకారం మొత్తం 9 మ్యాచులు జరుగుతాయి. ఇందులో ఇప్పటికే ఒకటి పూర్తయింది. మార్చి 27, ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10, 20, 21న మిగిలిన మ్యాచులు జరగబోతున్నాయి. ఈ తేదీల్లోనే హైదరాబాద్‌లో ఉన్న 24 డిపోల నుంచి మొత్తం 60 స్పెషల్ బస్సులు నడుస్తాయి.


బస్‌ స్టార్టింగ్ పాయింట్స్..

దిల్‌షుఖ్ నగర్, LBనగర్, హయత్‌నగర్, కోటి, లక్డీకపూల్,మేడ్చల్, KPHB, మియాపూర్, JBS, ECIL, ఘట్కేసర్, ఎన్జీవోస్ కాలనీ, బోయిన్‌పల్లి, ఛార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం, BHEL వంటి బస్ పాయింట్స్ నుంచి బస్సులు ప్రారంభమవుతాయి. ప్రత్యేక బస్సుల సదుపాయం మ్యాచ్‌లు జరిగిన రోజుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.


మెట్రో టైమింగ్స్..

ఐపీఎల్ మ్యాచ్ జరిగే రోజున చివరి మెట్రో ట్రైన్ రాత్రి 12.15 గం.లకు బయల్దేరి 1.10గం.లకు తన గమ్యస్తానానికి చేరుకుంటుంది. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్‌జీఆర్ఐ స్టేషన్‌లలో మాత్రమే ప్రయాణీకులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని గుర్తుపెట్టుంది. ఆయా స్టేషన్లలో క్రికెట్ అభిమానులతో పాటు సాధారణ ప్రయాణీకులకు ఈ సదుపాయం లభిస్తుంది. మిగిలిన మెట్రో స్టేషన్లలో ఎప్పట్లాగే చివరి రైలు రాత్రి 11.00 గంటలకు బయల్దేరి 12.00 గం.లకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.


Read Also : KTR: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు.. కేటీఆర్ ఫైర్

Revanth Reddy: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం..

Paper leakage: నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం.. హైకోర్టులో విద్యార్థిని పిటిషన్

Updated Date - Mar 27 , 2025 | 05:05 PM