Hyderabad: మెట్రో రెండో దశలో ముందడుగు
ABN , Publish Date - Mar 27 , 2025 | 08:39 AM
హైదరాబాద్ మెట్రో రైల్ రెండోదశ ప్రాజెక్టులో ముందడుగు పడింది. ప్రస్తుతమున్న ప్రాజెక్టుతోపాటు నూతన ప్రాజెక్టుపై కదలిక రావడంతో ప్రతిపాదిత ప్రదేశాల్లో కొత్తగా మెట్రో రైలు ఏర్పాటుపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తమ ప్రాంతాలకు మెట్రో కావాలని ఎదురుచూస్తున్న ఇక్కడి ప్రజల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

- ఢిల్లీలో అధికారుల సమావేశం
హైదరాబాద్ సిటీ: మెట్రో రెండోదశ ప్రాజెక్టులో ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వానికి పంపిన డీపీఆర్‌పై హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు(Hyderabad Metro Rail Project) అధికారులు ఢిల్లీలో సంబంధిత మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో బుధవారం తొలిసారిగా సమావేశయ్యారు. రెండో దశలో ప్రతిపాదించిన 5 మెట్రో మార్గాల డీపీఆర్(DPR)లను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Haragopal: హెచ్‌సీయూ భూమి వేలం సరికాదు..
రెండో దశ డీపీఆర్ కేంద్ర ప్రభుత్వం వద్ద కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉంది. తాజాగా దానిపై చర్చించేందుకు రమ్మని పిలుపు రావడంతో అనుమతుల విషయంలో ముందడుగు పడిందనే అభిప్రాయాన్ని మెట్రో అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య అంచనాతో పాటు నిర్మాణానికి అయ్యే వ్యయంపై చర్చించినట్లు సమాచారం. మరిన్ని చర్చల అనంతరం రెండోదశ మెట్రోకు కేంద్రం పచ్చజెండా ఊపే అవకాశం ఉందని తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
‘పది’ ప్రశ్నపత్రం లీకేజీకి రాజకీయ రంగు
Read Latest Telangana News and National News