Home » MLC Kavitha
ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case) మనీలాండరింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఈడీ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె ఏడో రోజు కస్టడీలో ఉన్నారు. నేటితోనే (23/03/24) కస్టడీ పూర్తవ్వాల్సింది కానీ.. కవితను విచారించేందుకు మరో ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని ఈడీ కోరింది. అయితే.. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్ట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) ఓ సూటి ప్రశ్న సంధించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్‌ను ఖండించిన కేసీఆర్.. కూతురు కవిత అరెస్ట్‌పై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ మౌనానికి గల కారణమేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
Meka Sravan ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మరో మూడ్రోజులకు పొడిగించిన సంగతి తెలిసిందే. అటు సోదాలు.. ఇటు రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో కవిత రిమాండ్ రిపోర్టును ఈడీ విడుదల చేసింది. ఈ రిపోర్టులో ఈడీ కీలక విషయాలను ప్రస్తావించింది. తాజా ఈడీ అఫిడవిట్‌తో కొత్త పేరు తెరపైకి వచ్చింది..
Kavitha ED Custody: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాసింత రిలీఫ్ దక్కింది. ఓ వైపు వరుస ఈడీ సోదాలు.. మరోవైపు కస్టడీలో విచారణతో సతమతం అవుతున్న కవిత..
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటి ముగిసింది. దీంతో కాసేపటి క్రితమే కవితను ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హాజరుపర్చారు. ఈడీ తరపున న్యాయవాది జోయాబ్ హుసేన్ వాదనలు వినిపించారు. కవితను విచారించేందుకు మరో అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు.
Kavitha ED Custody: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) ఈడీ కస్టడీ (ED Custody) మరో మూడ్రోజులు పొడిగించడం జరిగింది. అరెస్ట్ తర్వాత ఏడు రోజులపాటు ఈడీ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే..
MLC Kavitha: తనపై తప్పుడు కేసులు పెట్టారని ఎమ్మెల్సీ కవిత(Kavitha) అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam Case) కేసులో ఈడీ అదుపులో ఉన్న కవిత.. కోర్టుకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. తనపై కావాలని తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఇది నకిలీ కేసు అని, పొలిటికల్ కుట్ర అని ఆరోపించారు.
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఈడీ విచారణను ఎదుర్కుంటున్నారు. అయితే విచారణ సమయంలో కవిత తీవ్రమైన రక్తపోటును ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పీఎంఎల్ఏ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావడం లేదని, ఈడీ అధికారులు వైద్య పరీక్షలు నివేదికలు అందించడం లేదని పిటిషన్లో తెలిపారు.
ED Raids On Kavitha Family Members: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసును కొలిక్కి తీసుకురావడానికి ఈడీ (ED) అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Kejriwal) అరెస్టులు జరిగాయని హస్తిన వర్గాలు చెబుతున్న మాట..
ఆర్థిక నేరారోపణల కింద తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ ఎప్పటికప్పుుడు లేఖలు విడుదల చేస్తూ.. పలు సంచలనాలకు కేరాఫ్‌గా మారాడు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత, ఆప్ నేతలు కేజ్రీవాల్, సత్యేంద్రజైన్, సిసోడియాపై సంచలన ఆరోపణలు చేస్తూ సుఖేష్ ఇప్పటికే పలు లేఖలు విడుదల చేశాడు. తాజాగా కవిత అరెస్ట్‌కు తీహార్ జైలు స్వాగతం పలుకుతుందంటూ లేఖ రాసిన సుఖేష్.. అరవింద్ కేజ్రీవాల్‌ను వదిలిపెట్టలేదు.