Vaddiraju Ravi Chandra: ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది
ABN , Publish Date - Jan 09 , 2024 | 07:44 PM
కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యేలా కనిపించడం లేదని బీఆర్ఎస్ ( BRS ) రాజ్యసభ ఎంపీ వద్ది రాజు రవిచంద్ర ( Vaddiraju RaviChandra ) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యేలా కనిపించడం లేదని బీఆర్ఎస్ ( BRS ) రాజ్యసభ ఎంపీ వద్ది రాజు రవిచంద్ర ( Vaddiraju RaviChandra ) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఖమ్మం జిల్లా నుంచి 950 మంది నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందన్నారు. ఖమ్మం పార్లమెంట్ నుంచి నామా నాగేశ్వరరావుని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో ఖమ్మం జిల్లా నాయకులు ముక్త కంఠంతో నామా నాగేశ్వరరావుకి టికెట్ ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేయడానికి కాంగ్రెస్ పార్టీ చూస్తోందని వద్ది రాజు రవిచంద్ర అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...