Home » Nara Brahmani
Andhrapradesh: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని నారా కుటుంబం దర్శించుకుంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు మనవడు, యువనేత లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం ఉదయం నారా కుటుంబం తిరుమలకు చేరుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, భువనేశ్వరి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి శనివారం మంగళగిరిలో స్త్రీశక్తి కేంద్రాన్ని సందర్శించారు. మహిళలతో మాట్లాడి వారికి అందుతున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. నారా లోకేష్ నెలకొల్పిన స్త్రీశక్తి ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటుందని... మంగళగిరి మహిళలకు స్త్రీశక్తి ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా బ్రహ్మణి అన్నారు.
Andhrapradesh: శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , బ్రాహ్మణి గురువారం దర్శించుకున్నారు. శ్రీశైలం ఆలయం రాజగోపురం వద్ద లోకేష్, బ్రాహ్మణిలకు అర్చకులు, ఏఈవో హరిదాస్, అధికారులు స్వాగతం పలికారు.
Namrata Shirodkar Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ పుట్టిన జనవరి 22న తన పుట్టిన రోజు వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఆమె బర్త్‌డే చేసుకన్నారు. నర్మద బర్త్‌డే పార్టీకి సెలబ్రిటీలతో పాటు.. మరో కీలక వ్యక్తి కూడా హాజరయ్యారు.
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కోడలు, లోకేష్ సతీమణి బ్రహ్మణి ట్విట్టర్ వేదికగా తెలిపారు.
రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణి శుక్రవారం సాయంత్రం ములాఖత్ అయ్యారు. సుమారు 45 నిముషాలపాటు వారు చంద్రబాబుతో మాట్లాడనున్నారు.
గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అంటూ వినూత్న కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ఎమ్మెల్యే చినరాజప్ప ములాఖత్ అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రహ్మణి ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వస్తోంది. ‘‘మోత మోగిద్దాం’’ అంటూ బ్రహ్మణి ఇచ్చిన పిలుపుతో ఉదయం నుంచే విశాఖ వాసులు సంపూర్ణ మద్దతు తెలిపారు.