Home » Nara Chandrababu
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ ఎన్నో ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో సమాధానం ఇచ్చారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన సూపర్ ఎక్స్‌క్లూజివ్ ‘బిగ్ డిబేట్’ ప్రత్యక్షంగా వీక్షించండి.
ఏపీలోని ఐదేళ్ల వైఎస్సార్సీపీ (YSRCP) అరాచకపాలనపై ప్రాణాలొడ్డి పోరాడిన వారిలో తెలుగు యువత ముందు వరుసలో ఉంటుంది. అధికార పార్టీ దాడులకు, పోలీస్ కేసులకు వెరవకుండా తనదైన పోరాట పటిమతో అవిశ్రాంత పోరు నడిపింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) అందించిన ప్రోత్సాహం తెలుగు యువతలో కొత్తతరాన్ని తీర్చిదిద్దింది.
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్, మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి లపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ మద్యపాననిషేధం తెచ్చి ఓటు అడుగుతానని అన్నాడని ఆయన చెప్పిన మాటలు వట్టివేనని అన్నారు.
వృద్ధులను కూడా రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ వాడేసుకుంటున్నారని మైలవరం తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్(Vasantha Krishna Prasad) అన్నారు. బుధవారం నాడు మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండల పరిధిలోని ముచ్చనపల్లి, కుదప గ్రామాల్లో టీడీపీ ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు.