Home » Nellore
నెల్లూరు జీఆర్పీ సీఐ భుజంగరావు భారీ అవినీతి, అక్రమాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. సిబ్బంది, అధికారుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా విచారణ చేపట్టారు. విధులు సక్రమంగా నిర్వర్తించేలా చూడటం వల్లే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ సీఐ భుజంగరావు సమర్ధించుకున్నాడు.
నెల్లూరు: ప్రేమోన్మాదుల దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రేయసి కోసం ఏకంగా హత్యలకు పాల్పడుతున్నారు. ప్రేమించలేదని ఓ పక్క యువతులను చంపేస్తూ.. పెళ్లికి ఒప్పుకోవడం లేదని మరోపక్క అమ్మాయిల కుటుంబసభ్యులపైనా దాడులకు తెగబడుతున్నారు.
నెల్లూరులో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం నగరంలోని వీఆర్సీ క్రీడా మైదానంలో డప్పు వాయించి మహాసభల నిర్వహణకు....
Turaka Kishore: వైసీపీ నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్తోపాటు అతడి సోదరుడు శ్రీకాంత్కు మాచర్ల కోర్టు మళ్లీ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని నెల్లూరు జైలుకు తరలించారు.
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో తమ సంస్థకు గతంలో కేటాయించిన భూములను సందర్శించారు.
నెల్లూరు: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కాకాణిపై నెల్లూరు జిల్లా కావలి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల బోగోలు మండలం కోళ్లదిన్నెలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఇరువర్గాల వారు తీవ్రంగా గాయపడడంతో వారిని కావలి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు.
తడకలూరుకు చెందిన మనోహర్, మహలక్ష్మమ్మ గేదెలకు పచ్చిగడ్డి కోసం ఆటోలో తలమంచి మేజర్ కాలువపై వెళ్తుండగా.. వారి ఆటో ప్రమాదానికి లోనైంది. ఆటో బోల్తా పడుతున్న సమయంలో ఇద్దరూ ఆటో నుంచి బయటకు దూకేయడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే..
వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని, పోలీసులు టీడీపీ వారికి సహకరిస్తున్నారంటూ కాకాణి రివర్స్ ఎటాక్ చేశారు. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని.. పోలీసులు సప్తసముద్రాల అవతల ఉన్నా, లాక్కొచ్చి, ఒంటి మీద బట్టలు ఊడదీసి నిలబెడతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ISRO: గత డిసెంబర్ 30న షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ 60 పీఎస్ఎల్వీలో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపించింది. ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ బయలుదేరిన 15 గంటల 9 నిమిషాలకు స్పేడెక్స్ 1బీ, 15 గంటల12 నిమిషాలకు స్పేడెక్స్ 1ఏ రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తరువాత వీటి డాకింగ్ కోసం మూడు సార్లు ప్రయత్నించగా పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది.
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటన బాధాకరమన్నారు. విషయం తెలిసిన వెంటనే తనతో పాటు సహచర మంత్రులందరం కలిసి తిరుపతి చేరుకుని మృతుల కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూశామన్నారు. మృతుల్లో నలుగురు ఏపీ, ఒకరు తమిళనాడు, మరొకరు కేరళాకు చెందినవారు ఉన్నారని తెలిపారు.