Home » Nirmal
నిర్మల్ జిల్లా: మహబూబ్ ఘాట్ వద్ద 44 నంబర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. అదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 25 మందికి గాయాలుకాగా..
అక్రమాలకు పాల్పడిన ఇద్దరు మునిసిపల్ కమిషనర్లను సస్పెండ్ చేస్తూ బుధవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ పురపాలక సంఘంలో జరిగిన పబ్లిక్ హెల్త్ వర్కర్ల నియామకాలకు సంబంధించి అప్పటి నిర్మల్ మునిసిపల్ కమిషనర్, ప్రస్తుత తుర్కయాంజల్ మునిసిపల్ కమిషనర్ బి. సత్యనారాయణ రెడ్డిని అధికారులు తొలగించారు.
గోదావరి బేసిన్లో ఏటా వరదలతో నిండే ప్రాజెక్టుల్లో ఒకటైన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత రెండేళ్లూ భారీ వరదలతో ప్రాజెక్టు చిగురుటాకులా వణికిన విషయం విదితమే.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఆ క్రమంలో ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.
నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌కు(Lok Sabha Polling 2024) మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) అగ్రనాయకత్వం ప్రచారం దూసుకెళ్తుంది. బుధవారం నిర్మల్ జిల్లాలోని భైంసాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో అనుకోని పరిణామం ఎదురైంది.
ఆదిలాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రెండు చోట్ల బహిరంగ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు.
జీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపారు.
చెంగిచెర్లలో గిరిజన మహిళపై ఓ వర్గం దాడి చేయడం హేయమైన చర్య అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Maheshwar Reddy) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... బాధితులను పరామర్శించడానికి వెళ్లిన బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఇతర నేతలపై కేసులు పెట్టడం సరైంది కాదన్నారు.
నిర్మల్ జిల్లా: చిన్నప్పుడే పోలియో కారణంగా దివ్యాంగుడైన తన కొడుకును ఎలాగైనా విద్యావంతుడిగా చూడాలని ఆ తల్లి కలలు కంది. అందుకోసం చిన్నప్పటి నుంచి కొడుకును తన చేతుల మీదుగా తీసుకువెళ్లి చదివించింది. ఇప్పుడు తన కొడుకు పదో తరగతి పరీక్షలు రాస్తుండడంతో ఆ తల్లి ప్రతిరోజూ తన కొడుకును ఎత్తుకుని పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్ళి పరీక్ష రాయిస్తుంది.
Telangana: పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కమలం పార్టీ శ్రీకారం చుట్టింది. నేటి నుంచి మార్చి 2 వరకు విజయసంకల్ప యాత్ర పేరుతో రథయాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ఉదయం బాసర సరస్వతీ దేవి ఆలయం నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్ర ప్రారంభమైంది.