Share News

Tirupati: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి

ABN , Publish Date - Jan 25 , 2025 | 01:14 PM

ఆన్‌లైన్‌ బెట్టింగు(Online betting)లతో అప్పులపాలై.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతి(Tirupati)లో జరిగింది. ఈస్ట్‌ ఎస్‌ఐ మహేష్‌ తెలిపిన మేరకు శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన షేక్‌నూర్‌ మహ్మద్‌ ముబారక్‌ నగరంలోని కరకంబాడిలో ఉంటూ అమర ఆస్పత్రిలో మేల్‌ స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్నాడు.

Tirupati: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి

తిరుపతి: ఆన్‌లైన్‌ బెట్టింగు(Online Betting)లతో అప్పులపాలై.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతి(Tirupati)లో జరిగింది. ఈస్ట్‌ ఎస్‌ఐ మహేష్‌ తెలిపిన మేరకు శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన షేక్‌నూర్‌ మహ్మద్‌ ముబారక్‌ నగరంలోని కరకంబాడిలో ఉంటూ అమర ఆస్పత్రిలో మేల్‌ స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడిన ఇతడు.. లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. వీటిని తీర్చలేకపోవడం, రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Ballari: ఆ ఇద్దరి మధ్య స్నేహ బంధం చెడినట్లేనా..


pandu2.jpg

ఈక్రమంలోనే శుక్రవారం తిరుపతిలోని ఒక లాడ్జిలో గది అద్దెకు తీసుకుని విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకూ ఈయన బయటకు రాకపోవడంతో లాడ్జి నిర్వాహకులు ఈస్ట్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సిబ్బందితో కలిసి ఎస్‌ఐ మహేష్‌ అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా ముబారక్‌ మృతిచెంది ఉన్నాడు. మృతదేహాన్ని తిరుపతి రూయాకు తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: మా కుమార్తెలా ఏ అమ్మాయీ మోసపోవొద్దు

ఈవార్తను కూడా చదవండి: మేడిగడ్డలో లోపాలను 2019లోనే గుర్తించాం

ఈవార్తను కూడా చదవండి: ఎవుసంపై కేసీఆర్‌ నజర్‌

ఈవార్తను కూడా చదవండి: Uttam: హరీశ్‌వి దగుల్బాజీ మాటలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 25 , 2025 | 01:14 PM