Home » Organ Donation
అత్యవసరంగా అవయవాలు అవసరమైన వ్యక్తులకు మార్పిడి చేయడానికి విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రి ( Ayush Hospital ) వైద్యులు మహత్తర కార్యక్రమానికి సకల్పించారు. ఆస్పత్రిలో ఉన్న గుండె, కిడ్నీ, లివర్ శరీర భాగాలను వివిధ ప్రాంతాలకు వైద్యులు తరలిస్తున్నట్లు ఆయుష్ ఆస్పత్రి వైద్యులు వై. రమేష్ బాబు తెలిపారు.
మనిషికి పంది కిడ్నీ(Pig Kidney) అమర్చిన ప్రయోగం సక్సెస్ కావడంతో వైద్య రంగంలో కొత్త చరిత్ర లిఖితమైంది. పంది కిడ్నీ గతంలోకన్నా ఎక్కువ రోజులు రెండు నెలలపాటు విజయవంతంగా ఒక మనిషి శరీరంలో పని చేయడంతో అవయవాల కొరతను అధిగమించడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్ల ప్రయత్నాలకు ఈ ప్రయోగం కొత్త ఊపిరిలూదింది.
ప్రమాదంలో మరణించినా తన అవయవాలతో మరో నలుగురికి ప్రాణం పోసింది మహిళ. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ శ్రీరామ్‌నగర్‌కు చెందిన ప్రదీప్ కుమార్ భార్య, కుమారుడితో కలిసి నాలుగు రోజుల క్రితం షాపింగ్ కోసం ఇంటి నుంచి బయలుదేరారు.