Harish Rao: కాంగ్రెస్ హామీల అమలేది?
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:09 AM
రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఆయన మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి జనవరి 26న, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా మార్చి 31 నాటికి రైతులందరికీ భరోసా డబ్బులు అందిస్తామని ప్రకటించినప్పటికీ, అది అమలు కాలేదని ఆరోపించారు. రాయితీల విషయంలో అబద్ధాలు చెప్పడం, మాటలు మడతేయడం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని ఆయన పేర్కొన్నారు.

ఇంకెన్నిసార్లు మోసం చేస్తావ్ రేవంత్ : హరీశ్‌రావు
ప్రియాంకాజీ.. యువతుల స్కూటీలు ఎక్కడ?: కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : తేదీలు, గడువులు మారుతున్నాయి తప్ప.. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని.. మాటిచ్చి మోసం చేయడం, నాలుక మడతేయడం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని మాజీమంత్రి హరీ్‌షరావు ఆరోపించారు. జనవరి 26న, మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ మార్చి 31 నాటికి రైతులందరికీ భరోసా డబ్బులు వేస్తామన్నారు.. ఏమైందని మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన ప్రశ్నించారు. రైతులను ఇంకెన్నిసార్లు మోసం చేస్తావు రేవంత్‌రెడ్డీ..? దసరాకిస్తామని ఇవ్వలేదు. సంక్రాంతికీ ఇవ్వలేదు.. ఉగాదికి ఇస్తామని ఊరించి రైతులను ఉసూరుమనిపించావని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి ఉగాది వేళ ఆశగా ఎదురుచూసిన రైతులకు చేదు అనుభవమే ఎదురైందని పేర్కొన్నారు. రుణమాఫీని వంచనగా మార్చారని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అడుగు ముందుకు పడటం లేదని అన్నారు. కాగా, ఎన్నికల సమయంలో ఆడబిడ్డలను ఆకర్షించే హామీలిచ్చి అధికారం చేపట్టారు.. స్వయంగా మీరే స్కూటీలిస్తామన్నారు. 15 నెలలు గడిచినా.. ఇప్పటికీ ఇవ్వలేదు.. ప్రియాంకాజీ.. తెలంగాణ యువతుల స్కూటీలు ఎక్కడ? అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈమేరకు స్కూటీ మీనియేచర్‌ని పట్టుకున్న ఘిబ్లీ ఇమేజ్‌ను మంగళవారం ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News