Hyderabad: హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన ఈమె ఎంత మంచిదంటే..
ABN , First Publish Date - 2023-08-29T19:33:00+05:30 IST
ప్రమాదంలో మరణించినా తన అవయవాలతో మరో నలుగురికి ప్రాణం పోసింది మహిళ. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ శ్రీరామ్‌నగర్‌కు చెందిన ప్రదీప్ కుమార్ భార్య, కుమారుడితో కలిసి నాలుగు రోజుల క్రితం షాపింగ్ కోసం ఇంటి నుంచి బయలుదేరారు.
రాయదుర్గం (ఆంధ్రజ్యోతి): ప్రమాదంలో మరణించినా తన అవయవాలతో మరో నలుగురికి ప్రాణం పోసింది మహిళ. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ శ్రీరామ్‌నగర్‌కు చెందిన ప్రదీప్ కుమార్ భార్య, కుమారుడితో కలిసి నాలుగు రోజుల క్రితం షాపింగ్ కోసం ఇంటి నుంచి బయలుదేరారు. బైక్‌పై వెళ్తున్న తరుణంలో రోడ్డుపై కుక్క అడ్డురావడంతో తప్పించబోయి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో తండ్రీ, కొడుకుకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ, భార్య కీర్తిశిల్పి(33)కి మాత్రం తలకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా, ఆదివారం ఉదయం బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో వైద్యులు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి భర్త, కుటుంబ సభ్యుల అంగీకారంతో కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులు తీసుకున్నారు. తాను చనిపోతూ మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం జీవన్‌దాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ చానల్ ద్వారా అవసరం ఉన్నచోటికి అవయవాలను తరలించారని జీవన్‌దాన్ కమిటీ సభ్యులు తెలిపారు.