Home » Palnadu
Andhrapradesh: ఏపీలో ఊరూవాడా పెన్షన్ల పంపిణీతో ఓవైపు పండగ వాతావరణం నెలకొంటే.. మరోవైపు పెన్షన్ల విషయంలో ఓ సచివాలయ ఉద్యోగి చేసిన నిర్వాకంతో అంతా అవాక్కవ్వాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేటి నుంచి పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
పల్నాడు జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కొమర శివపై పిన్నెల్లి మాచర్ల కోర్టు వద్ద పిడికిలితో కడుపులో గుద్ది దాడి చేశారని పేర్కొంటూ శివ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పల్నాడు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ మండలం, అందుగుల కొత్తపాలెం, సమీపంలో గురువారం తెల్లారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టిన మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది.
నరసరావుపేట(Narasaraopet)లో జిల్లా వైసీపీ కార్యాలయానికి(YSRCP Office) అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (Former MLA Gopireddy Srinivasa Reddy) మండిపడ్డారు. 2014- 2019మధ్య టీడీపీ ప్రభుత్వంలో అనేక జిల్లాల్లో జీవో నంబర్ 27తెచ్చి టీడీపీ ఆఫీసుల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను కేటాయించుకున్నారని గోపిరెడ్డి ఆరోపించారు.
పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం, కంటేపూడి దగ్గర ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో క్లీనర్ మణికంఠ (24) మృతి చెందగా, మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన వైసీపీ నేతలు తెలంగాణకు మకాం మార్చారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ సరిహద్దులోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కృష్ణపట్టె గ్రామాలు, సమీప పట్టణాల్లో తిష్ఠవేశారు.
జిల్లాలో పరిస్థితి క్షణ క్షణం ఉత్కంఠ భరితంగా మారుతోంది. పిన్నెల్లి వ్యవహారంలో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈవీఎం ధ్వంసం కేసు సహా పలు కేసుల్లో నిందితుడైన మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి..
ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో జూన్ 4న ఓట్ల కౌంటింగ్(Counting of Votes) సందర్భంగా జిల్లా పోలీసులు(Palnadu Police) అప్రమత్తం అయ్యారు. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ముందస్తు బెయిల్ రద్దుపై రేపు(సోమవారం) సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరుగనున్నది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ చేపట్టునున్నది.