Share News

యువత అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడవాలి

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:45 PM

యువకులంతా అంబేడ్కర్‌ అడుగు జాడల్లో నడవాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నా రు. మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళుల ర్పించారు. అంబేడ్కర్‌ ఒక కులానికో మతానికో చెందిన వాడు కాదని ఆయన అందరి వాడన్నారు. దేశంలో రాజ్యాం గాన్ని మార్చే కుట్ర జరుగుతుందని, ప్రజలంతా కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

యువత అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడవాలి

ధర్మారం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): యువకులంతా అంబేడ్కర్‌ అడుగు జాడల్లో నడవాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నా రు. మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళుల ర్పించారు. అంబేడ్కర్‌ ఒక కులానికో మతానికో చెందిన వాడు కాదని ఆయన అందరి వాడన్నారు. దేశంలో రాజ్యాం గాన్ని మార్చే కుట్ర జరుగుతుందని, ప్రజలంతా కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తహసీల్దార్‌ ఎండీ వఖీల్‌, ఎంపీడీవో ప్రవీణ్‌ కుమార్‌, ఎంపీఓ రమేష్‌, ఏఎంసీ చైర్మెన్‌ రూప్లా నాయక్‌, బొల్లి స్వామి, కాడే సూర్యనారాయణ, దేవి జనార్దన్‌, పాలకుర్తి రాజేశం, దేవి రాజలింగయ్య, కాంపెల్లి చంద్రశేఖర్‌, కాంపెల్లి రాజేశం మాట్లాడారు.

కమాన్‌పూర్‌, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడు తూ అంబేడ్కర్‌ జీవితం సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. అంబేడ్కర్‌ భావజాలం ఆధారంగా నూతన భారత నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. పారి శుధ్య కార్మికులను సన్మానించారు. ఎస్సీ కమ్మూనిటీ హాల్‌ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని దళిత సంఘాల నాయకులు విన్నవించారు. నాయకులు కుక్క రవీందర్‌ ఆధ్వర్యంలో జరిగిన పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇనుగంటి భాస్కర్‌రావు, మాజీ ఎంపీపీ కోలేటి మారుతి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చగిరి రాము, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్‌, మాజీ ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ గుర్రం లక్ష్మీ మల్లు, నాయకులు చంద్రమౌళి, చిప్పకుర్తి సత్యనారాయణ, అంబటి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌, (ఆంధ్రజ్యోతి): అంబేద్కర్‌ జయంతిని సుల్తానాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయరమణారావు, వివేక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ ప్రకాశ్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, మిట్టపల్లి ప్రవీణ్‌కుమార్‌, కమిటీ బాద్యులు న్యాతరి శ్రీని వాస్‌, ప్రభాకర్‌, క్యాదాసి చంద్రమౌళి, చిలుక రాజేశం, కలువల శ్రీనివాస్‌ అంబేద్కర్‌ విగ్రహానికి, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కొదరుపాకలో బీజేపీ ఓబీసీ జిల్లా చైర్మన్‌ చాతరాజు రమేష్‌, గర్రెపల్లిలో జెట్టి శ్రీనివాస్‌, వడ్లకొండ మహేష్‌ గౌడ్‌, లక్ష్మణ్‌, హరీష్‌ రాజు తదితరులు జయంతి కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - Apr 14 , 2025 | 11:45 PM