ఎన్టీపీసీలో అగ్నిమాపక వారోత్సవాలు
ABN , Publish Date - Apr 14 , 2025 | 11:49 PM
రామగుం డం ఎన్టీపీసీలో సోమవారం జాతీయ అగ్నిమాపక(ఫైర్ సర్వీస్) వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జాతీ య ఫైర్ సర్వీస్ డే సంద ర్భంగా వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలను ఎన్టీపీసీ జీఎం ఎ.కె.త్రిపాఠి ప్రారంభిం చారు.

జ్యోతినగర్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి) : రామగుం డం ఎన్టీపీసీలో సోమవారం జాతీయ అగ్నిమాపక(ఫైర్ సర్వీస్) వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జాతీ య ఫైర్ సర్వీస్ డే సంద ర్భంగా వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలను ఎన్టీపీసీ జీఎం ఎ.కె.త్రిపాఠి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ముంబయ్ పోర్టులో అగ్ని ప్రమాదంలో మంటలను ఆర్పుతూ ప్రాణత్యాగం చేసిన అమరులకు ఎన్టీపీసీ జీఎం త్రిపాఠి, సీఐఎస్‌ఎఫ్ సీని యర్ కమాండెంట్ అరవింద్ కుమార్ నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా జీఎం త్రిపాఠి మాట్లాడుతూ జాతీయ పారిశ్రామిక ఆస్తులను కాపాడడంలో సీఐఎస్ ఎఫ్ చేస్తున్న సేవలు మరువ లేనివన్నారు. అగ్ని ప్రమా దాలు జరుగకుండా సీఐఎస్‌ఎఫ్ జవానులు నిత్యం కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, అధికారు లతో ఫైర్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించారు. అగ్నిమాపక వారో త్సవాల సందర్భంగా ఎన్టీపీసీ ఉద్యోగులు, విద్యార్థులు, సీఐఎస్‌ఎఫ్ జవానులకు వివిధ రకాల పోటీలను నిర్వహిస్తారు. ఫైర్ సర్వీస్ వీక్ ఈనెల 20న ముగు స్తుంది. కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్ డిప్యూటీ కమాం డెంట్ ఒ.వి.కె. శాస్త్రి, ఉద్యోగులు, అధికారులు, జవానులు పాల్గొన్నారు.