Home » Phone tapping
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వేసిన పిటిషన్‌పై మరికాసేపట్లో తీర్పు వెలువడనుంది. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రణీత్ రావు పిటిషన్‌పై నిన్న (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. కస్టడీకి ఎలాంటి కండిషన్లు పెట్టకుండా కింది కోర్ట్ ఆదేశాలు ఇచ్చిందని ప్రణీత్ తరపు న్యాయవాది వాదించారు. గత 4 రోజులుగా బంజారాహిల్స్ పీఎస్‌కు తాళం వేసి అక్కడే ప్రణీత్‌ను పోలీసులు విచారిస్తున్నారు.
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు రావు వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రతీణ్‌రావు హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఈరోజు మధ్యాహ్నం విచారణకు వచ్చింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం రేపు(గురువారం) తీర్పును ప్రకటించనుంది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు (Praneeth Rao) మూడో రోజు కస్టడీ విచారణ ముగిసింది. దర్యాప్తు బృందం (Investigation Team) అతడిని దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. ఈ విచారణలో భాగంగానే.. ప్రణీత్‌తో కలిసి పనిచేసిన అధికారుల వివరాలు దర్యాప్తు బృందం సేకరించింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ధ్వంసం చేశారనే ఆరోపణలతో అరెస్టైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (SIB) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును పంజాగుట్ట పోలీసుల ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసుకోవడం సాధారణమే..! ప్రణీత్‌రావు ఏకంగా ఎస్ఐబీ కేంద్రంగా పలు జిల్లాల్లో వార్‌రూమ్‌లను ఏర్పాటు చేశారని పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు.. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ)లో తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, విపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న డీఎస్పీ ప్రణీత్‌రావుపై కేసు నమోదైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి రోజున.. అంటే.. గత ఏడాది డిసెంబరు 4న ప్రణీత్‌రావు కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను కాల్చివేశాడంటూ..
Phone Tapping: పొరుగు రాష్ట్రం తెలంగాణలో గత సీఎం కేసీఆర్ (KCR) హయాంలో ప్రతిపక్ష నేతలు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ (Phone Tapping) జరగడంపై విచారణ ఊపందుకుంది. దీనిని నిర్ధారించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును సస్పెండ్ చేసింది. అయితే, ఈ వ్యవహారం ఏపీలోనూ కలకలం రేపింది.
సాధారణంగా ఏ ఫోన్ అయినా పాస్వర్డ్ మర్చిపోతే.. దాని లాక్ తీయడం దాదాపు అసాధ్యం. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో చిన్న టిప్స్ పాటిస్తే.. అన్‌లాక్ చేయడానికి వీలుంటుంది. అదే ఆపిల్ ఐఫోన్లో పాస్వర్డ్ మర్చిపోతే దానిని అన్‌లాక్ చేయడం దాదాపు అసాధ్యమే. ఫోన్‌ను పూర్తిగా రీసెట్ చేయడం, బ్యాకప్ నుంచి డేటాను పొందడం మినహా మరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఉంటుంది. అయితే, iOS 17 అప్డేట్తో ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది యాపిల్ సంస్థ.
ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం భగ్గుమనడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఎన్ని ఫోన్లు ట్యాపింగ్ చేయాలనుకుంటే అన్ని ఫోన్లు ట్యాప్ చేయండి.. నా ఫోన్ కూడా తీసుకోండి, భయపడేది లేదు..అని అన్నారు.
ఏపీ ప్రభుత్వాన్ని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇరకాటంలో పెట్టారు.