Home » Phone tapping
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఇదివరకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.
Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీసింది. ఇప్పటికే ప్రభాకర్ రావుపైన కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభాకర్‌రావు వర్చువల్‌గా విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్లింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌ను తమ ఎదుట హాజరుపరచాలని దర్యాప్తు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాధాకిషన్‌రావును రెండు రోజుల పాటు కస్టడీకీ నాంపల్లి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయనను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మరోవైపు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో మరో కేసు నమోదు అయ్యింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసులను తక్షణమే సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విద్యుత్తు కొనుగోలు అంశంలో జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తును వేగవంతం చేయాలని పేర్కొంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసు నిందితులుగా ఉన్న భుజంగరావు, రాధా కిషన్, తిరుపతన్న, ప్రణీత్ రావులకు మరోసారి చుక్కెదురైంది.
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావును విచారించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
‘‘నేను ఇప్పట్లో భారత్‌కు రాలేను. వీడియో లేదా టెలికాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవ్వగలను’’ అని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు.
వివాదాస్పద పెగాసెస్ స్నూపింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తన ఫోన్‌ను పెగాసెస్ స్పైవేర్ 'హ్యాక్' చేసిందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె, మీడియా అడ్వయిజర్ ఇల్తిజా ముఫ్తి బుధవారంనాడు తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళా నేతలపై అధికార బీజేపీ స్నూపింగ్‌కు పాల్పడుతోదంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో సంచలన ఆరోపణలు చేశారు.