Share News

Phone Tapping Case.. రెండు నంబర్లు ట్యాప్ చేయించిన లింగయ్య..

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:47 AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు బొల్లం మల్లయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా రాజాకీయ నేతలను పోలీసులు విచారించనున్నారు. చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మల్లయ్య, శేఖర్ రెడ్డిలను విచారణ చేసే అవకాశముంది.

Phone Tapping Case.. రెండు నంబర్లు ట్యాప్ చేయించిన లింగయ్య..

హైదరాబాద్: ఫోన్ టాపింగ్ కేసులో (Phone Tapping Case) బిగ్ ట్విస్టు (Big Twist) నెలకొంది. మునుగోడు ఉపఎన్నిక సమయంలో బీఆర్ఎస్ నేత (BRS Leader), నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) రెండు నంబర్లను ట్యాప్ చేయించారు. దీనికోసం తిరుపతన్న, భుజంగరావులకు లింగయ్య నెంబర్లు పంపారు. ప్రస్తుత నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులుగా మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్ ఉన్నారు. ఈ ఇద్దరి ఫోన్‌లు ట్యాప్ చేసినట్టు ఎయిర్టెల్ కంపెనీ నుంచి రిపోర్ట్ వచ్చింది. ఈ వ్యవహారంలోనే గురువారం లింగయ్యను పోలీసులు విచారించనున్నారు. మరోవైపు మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్‌ను సైతం ఈరోజు విచారణకు పోలీసులు రావాలని నోటీసులు పంపించారు.


ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణ..

కాగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు బొల్లం మల్లయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా రాజకీయ నేతలను పోలీసులు విచారించనున్నారు. చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మల్లయ్య, శేఖర్ రెడ్డిలను విచారణ చేసే అవకాశముంది. ఇది రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. లింగయ్య విచారణ తర్వాత మరో మాజీ మంత్రికి నోటిసులు ఇచ్చే అవకాశాలు ఉంది.

బయట పడుతున్న పొలిటికల్ లింక్‌లు

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో పొలిటికల్ లింక్‌లు బయట పడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో జరిగిన పరిణామాలపై ఆధారాలు బయటపడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో పోలీసుల ద్వారా అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థికి డబ్బులు పంపిణీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బుల తరలింపులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారు. తిరుపతన్న ఫోన్లో కీలక ఆధారాలు లభించాయి. ఈ ఆధారాలను బెస్ చేసుకుని బీఆర్ఎస్ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.


అయితే.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో అధికారులు సాంకేతిక ఆధారాలతో ముందుకెళ్తున్నారు. ఈ కేసులో అరెస్టైన నిందితుల సెల్‌ఫోన్లలో డిలీట్ చేసిన సమాచారాన్ని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్ఎల్‌) నిపుణులు తిరిగి (రిట్రీవ్‌)లో రాబట్టారు. అందులో కీలక సంభాషణలు బయటపడటంతో వాటి ఆధారంగా కేసు దర్యాప్తులో రెండో అంకాన్ని ప్రారంభించారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌రావు, అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, డీఎస్పీ ప్రణీత్‌రావు నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను పరిశీలించిన ఎఫ్‌ఎస్ఎల్‌ బృందం.. నిందితులు డిలీట్‌ చేసిన సమాచారంలో చాలా వరకు తిరిగి రాబట్టినట్లు తెలుస్తోంది. ఓ వైపు కాల్‌ డేటా రికార్డు (సీడీఆర్‌), మరోవైపు ఎఫ్‌ఎస్ఎల్‌ నివేదికతో అధికారులు కేసు దర్యాప్తులో ముందుకెళ్తున్నారు. ట్యాపింగ్‌ కేసులో పట్టుబడ్డ నలుగురు అధికారులు గత ప్రభుత్వంలోని కొందరు ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు పనిచేసిన తీరుపై ఆధారాలు లభించినట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

నాకు అంత స్ధాయిలేదు లోకేష్‌ అన్నా..: శ్రీరెడ్డి

వైసీపీ సర్పంచ్ హుసేని ఇద్దరు కార్యకర్తల అరెస్టు..

అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం...

ప్రజా పాలన విజయోత్సవాలు..

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ట్రాఫిక్ ఏసీపీ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 14 , 2024 | 02:49 PM