Home » Phone tapping
ఫోన్ ట్యాపింగ్లో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు.1200 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయి. విచారణలో ప్రణీతరావు ఇచ్చిన వాంగ్మూలంలో 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జీలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వాళ్ల కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) వ్యవహారంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman) సంచలన కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయట పడుతున్నాయని.. ఈ వ్యవహారంపై రేవంత్ సర్కార్(CM Revanth Reddy) ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అయినా కేసు వ్యవహారం పట్టనట్లు రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. తప్పు చేస్తే జైలుకు పంపిస్తామని చెప్పిన సీఎం రేవంత్... ఇన్ని సంచలనాత్మక విషయాలు బయటకు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
రాజకీయ ప్రత్యర్థులు.. సొంత పార్టీ నేతలు, పాత్రికేయులు, న్యాయవాదులే కాదు.. సాక్షాత్తూ హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ను సైతం బీఆర్ఎస్ సర్కారు ట్యాప్ చేసిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది!
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తనను రాజకీయంగా దెబ్బ తీయడానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన ఫోన్ను ట్యాపింగ్ చేయించారని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఆరోపించారు.
‘‘మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కేసీఆర్ అంగి, లాగు చించుకుని రోడ్డుమీద తిరుగుతూ ఏం చెప్పినా పట్టించుకోను. సాంకేతిక నిపుణుల సలహా మేరకే మరమ్మతుల విషయంలో ముందుకు వెళతాను. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేసీఆర్ అనాలోచితంగా ఎందుకు వ్యవహరించారో తెలియదు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తులు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశాడు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు స్పష్టం చేశాడు.
ఫోన్ ట్యాపింగ్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షాలపై సైబర్ దాడి జరిగిందని విమర్శించారు.
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది..