Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం
ABN , Publish Date - Jul 12 , 2024 | 06:01 PM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసు నిందితులుగా ఉన్న భుజంగరావు, రాధా కిషన్, తిరుపతన్న, ప్రణీత్ రావులకు మరోసారి చుక్కెదురైంది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసు నిందితులుగా ఉన్న భుజంగరావు, రాధా కిషన్, తిరుపతన్న, ప్రణీత్ రావులకు మరోసారి చుక్కెదురైంది. వీరి నలుగురి బెయిల్ పిటిషన్‌ను కోర్టు మరోసారి తిరస్కరించింది. వీరి పిటిషన్లను నాంపల్లి క్రిమినల్ కోర్టు కొట్టివేసింది. అరెస్టు చేసి వంద రోజులైనా చార్చిషీట్ దాఖలు చేయకపోవడం డిఫాల్ట్ బెయిల్ కోసం నిందితులు పిటిషన్ వేశారు.
కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు నలుగురు మ్యాండేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఇప్పటివరకు చార్జిషీట్ దాఖలు చేయలేకపోయారంటూ నిందితుల తరుపు న్యాయవాదులు వాదించారు.కేసు నమోదయ్యి, నిందితులను అరెస్ట్ చేసి 100 రోజులు దాటిందని పేర్కొన్నారు.
విచారణకు ముందు విచారణ అధికారులు జడ్జి ఛాంబర్‌లోకి వెళ్లారు. ఛార్జిషీట్ వెనక్కి ఇచ్చినంత మాత్రాన వేయనట్టు కాదని పోలీసుల తరుపు న్యాయవాది వాదించారు. విచారణ కీలక దశలో ఉందని, బెయిల్ ఇవ్వొద్దని కోర్టుని పోలీసులు కోరారు. ఇరుపక్షాల వాదనలు పూర్తయిన నేపథ్యంలో కోర్టు వారి బెయిల్‌ను తిరస్కరిస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. కాగా ఈ కేసులో ప్రణీత్ రావు ఏ2గా, తిరుపతన్న ఏ3గా, భుజంగరావు ఏ4గా, రాధాకిషన్ రావు ఏ5గా ఉన్నారు.
For more Telangana News and Telugu News