Home » Phone tapping
రాజకీయ ప్రత్యర్థులు.. సొంత పార్టీ నేతలు, పాత్రికేయులు, న్యాయవాదులే కాదు.. సాక్షాత్తూ హైకోర్టు న్యాయమూర్తి ఫోన్‌ను సైతం బీఆర్ఎస్ సర్కారు ట్యాప్ చేసిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది!
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తనను రాజకీయంగా దెబ్బ తీయడానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన ఫోన్‌ను ట్యాపింగ్ చేయించారని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఆరోపించారు.
‘‘మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కేసీఆర్ అంగి, లాగు చించుకుని రోడ్డుమీద తిరుగుతూ ఏం చెప్పినా పట్టించుకోను. సాంకేతిక నిపుణుల సలహా మేరకే మరమ్మతుల విషయంలో ముందుకు వెళతాను. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేసీఆర్ అనాలోచితంగా ఎందుకు వ్యవహరించారో తెలియదు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తులు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశాడు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు స్పష్టం చేశాడు.
ఫోన్ ట్యాపింగ్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షాలపై సైబర్ దాడి జరిగిందని విమర్శించారు.
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది..
కోరుట్ల కాంగ్రెస్ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగరావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో తన ఓటమికి కేసీఆరే కారణమన్నారు. ఎమ్మెల్యేగా కల్వకుంట్ల సంజయ్ గెలుపులో ఆయన ప్రముఖ పాత్ర పోషించారన్నారు. ఎన్నికల సమయంలో తన పోన్ ట్యాప్ చేసి ప్రతి కదలికా తెలుసుకున్నారని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్, ఎస్ఐబీ ప్రధాన కార్యాలయంలో హార్డ్ డిస్క్‌ల విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అరె్‌స్టకు వారెంట్ జారీ అయింది. ప్రభాకర్‌రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్‌కుమార్‌పై కూడా నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(SIB Ex Chief Prabhakar Rao) తొలిసారి ఈ కేసుపై స్పందించారు. తన వాదనలను అఫిడవిట్ ద్వారా వివరించారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు(Red Corner Notice) జారీ చేసే అంశంపై కోర్టులో వాదనలు జరిగాయి.
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy)సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమానికి నేడు (మంగళవారం) తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విశిష్ఠ అతిథిగా విచ్చేశారు. ఈ డిబేట్లో పలు కీలక విషయాలను పంచుకున్నారు సీఎం రేవంత్.