Share News

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఫైనల్‌గా ఇలా..!

ABN , Publish Date - Jun 25 , 2024 | 05:33 PM

తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) కేసు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పలు సంచలన విషయాలు ఈ కేసులో బయటకిరాగా.. తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది..

Phone Tapping:  ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఫైనల్‌గా ఇలా..!

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) కేసు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పలు సంచలన విషయాలు ఈ కేసులో బయటకిరాగా.. తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎవిడెన్స్ మెటీరియల్ మొత్తాన్ని పోలీసు ఉన్నతాధికారులు కోర్టుకు సమర్పించారు. మూడు బాక్సులలో న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించడం జరిగింది. ఇందులో హార్డ్ డిస్క్‌లు, సిడీ, పెన్ డ్రైవ్‌లను పోలీసు కోర్టు ముందు ఉంచారు. ఫైనల్‌గా అన్నిటినీ జత పరుస్తూ పోలీసులు మూడోసారి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కాగా.. ఈ ఆధారాలను నిందితులకు తెలీకుండా రహస్యంగా ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ కోరారు. అనంతరం మాజీ అడిషనల్ ఎస్పీల బెయిల్ పిటిషన్ ల పై విచారణ వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. బుధవారం నాడు తిరుపతన్న, భుజంగ రావ్ బెయిల్ పిటిషన్‌లపై న్యాయస్థానంలో విచారణ జరగబోంది.

Updated Date - Jun 25 , 2024 | 05:52 PM