Home » Priyanka Gandhi
మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి ఉద్వాసన పలికేందుకు మార్పు కోరుతూ బలంగా గాలులు వీస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. గ్వాలియర్లో శుక్రవారం జరిగిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
రాజకీయంగా లబ్ధి కోసమే జగన్ అమరావతిలో ఆర్ 5 జోన్ పేరుతో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. పేదలను అమరావతి రైతులపై ఉసి గొల్పుతున్నారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో అమరావతి రైతులు ఉన్నారు. రాహుల్ గాంధీ త్వరలోనే అమరావతి వస్తారు. ప్రియాంక గాంధీ కూడా త్వరలో అమరావతి వచ్చి రైతుల ఉద్యమంలో అడుగు వేస్తారు
అవును.. తెలంగాణలో ఎన్నికల (TS Elections) సీజన్ వచ్చేసింది.. అధికార బీఆర్ఎస్ (BRS), ప్రతిపక్షపార్టీలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు పోటాపోటీగా ఎన్నికల హామీలు, బహిరంగ సభలు నిర్వహించేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ కంటే ఒక అడుగు ముందే ఉంది కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీ వరుసగా సాధించిన రెండు విజయాలతో ఇప్పుడు 'హ్యాట్రిక్'పై కన్నేసింది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సాధించిన ఘనవిజయాన్ని మధ్యప్రదేశ్లో పునరావృతం చేసేందుకు ఎన్నికల ప్రచారన్ని షురూ చేసింది.
కర్ణాటక ఎన్నికల్లో సాధించిన విజయంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారంనాడు మధ్యప్రదేశ్లో పర్యటించి గ్వారీఘాట్ వద్ద నర్మదా పూజలో పాల్గొన్నారు. అనంతర ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయంతో ఉత్సాహంతో ఉన్న శతాధిక వత్సరాల కాంగ్రెస్ పార్టీ కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఐదు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలు, అత్యంత కీలకమైన 2024 లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందస్తు వ్యూహరచన సాగిస్తోంది. ఇందులో భాగంగా ప్రియాంక గాంధీ వాద్రాకు పార్టీలో మరింత కీలక పాత్ర ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
ఆదాయపు పన్ను శాఖ తీసుకున్న ఓ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా ఆయనకు రాహుల్ గాంధీ ఘననివాళులర్పించారు. దీనికి ముందు, రాహుల్ తన తండ్రికి భావోద్యోగంతో కూడిన ట్వీట్ చేశారు. ''పాపా, మీరు నాతోనే ఉన్నారు, మీరే స్ఫూర్తి, మీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి'' అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న తరుణంలో శనివారం కర్ణాటక ప్రజల శ్రేయస్సు కోసం ప్రియాంక గాంధీ ఆలయంలో పూజలు చేశారు....
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తెలంగాణ (Telangana) నుంచి పోటీ చేస్తున్నారా..? రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇక్కడ్నుంచే పోటీచేయాలని ఫిక్స్ అయ్యారా..? అప్పుడే రెండు నియోజకవర్గాలను కూడా పెద్దలు ఎంపిక చేసేశారా..?..