Congress Priyanka Gandhi: కొల్లాపూర్‌లో 30న జరగాల్సిన ప్రియాంక గాంధీ సభ వాయిదా

ABN , First Publish Date - 2023-07-27T19:11:56+05:30 IST

కాంగ్రెస్ పార్టీలో (Congress party) జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) చేరిక మరింత ఆలస్యమవనుంది. కొల్లాపూర్‌లో ఈ నెల 30న నిర్వహించ తలపెట్టిన ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) బహిరంగ సభ మరోసారి వాయిదా పడింది. భారీ వర్షాల ప్రభావంతో ఈ సభను వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. కాగా ఈనెల 20న జరగాల్సిన సభను 30కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Congress Priyanka Gandhi: కొల్లాపూర్‌లో 30న జరగాల్సిన ప్రియాంక గాంధీ సభ వాయిదా

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో (Congress party) జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) చేరిక మరింత ఆలస్యమవనుంది. కొల్లాపూర్‌లో ఈ నెల 30న నిర్వహించ తలపెట్టిన ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) బహిరంగ సభ మరోసారి వాయిదా పడింది. భారీ వర్షాల ప్రభావంతో ఈ సభను వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. కాగా ఈనెల 20న జరగాల్సిన సభను 30కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సభకు ఆటంకం కలిగించే అవకాశం ఉండడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.


మరో రెండు రోజులు రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉండడంతో కాంగ్రెస్ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జన సమీకరణ కూడా సంక్లిష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో అనివార్య పరిస్థితుల్లో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. వర్షాలు తగ్గుముఖం పట్టాక సభకు సంబంధించిన తదుపరి తేదీని ప్రకటిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

Updated Date - 2023-07-27T19:12:41+05:30 IST