MLA SINDHURA REDDY: ప్రజల కోసం బాధ్యతగా పనిచేయండి
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:03 AM
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి అధికారులు బాఽధ్యయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సునితాబయి అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహించారు.

నల్లమాడ, మార్చి29 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి అధికారులు బాఽధ్యయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సునితాబయి అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం వేసవికాలంలో తాగునీటి సమస్య గ్రామాల్లో ఎక్కువగా ఉందన్నారు. సమస్య ఉత్పన్నం కాకుండాచూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారుల పై ఉందన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి పథకం కింద కూలీలకు పనిదినాలతోపాటు కూలి ధరలు కూడా ప్రభుత్వం పెంచిందన్నారు. క్షేత్రస్థాయిలో తగిన పనులు కల్పించుకుని కూలీలు ఉపాధి పొందాలన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, పంచాయతీ రాజ్, ఇరిగేషన, అటవీ, పట్టుపరిశ్రమ, గ్రామీణాభివృద్ధి శాఖలు అమలు చేస్తున్న పథకాలను సమావేశం వివరించారు. పలువురు ఎమ్మెల్యేకి వినతిపత్రాలు అందించారు. తహసీల్దార్ రంగనాయకులు, ఎంపీడీఓ ఆజాద్, సూపరింటెండెంట్ గజ్జల శ్రీనివాసరెడ్డి, ఈఓఆర్‌డీ అమరనాథ్‌రెడ్డి, వైద్యాధికారి బాబ్‌జాన పాల్గొన్నారు.