Share News

JUDGE: విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలి

ABN , Publish Date - Mar 30 , 2025 | 12:05 AM

ప్రతి విషయంలోనూ విద్యార్థినులు జాగ్రత్తగా మెలిగితే మంచి ఫలితాలు ఉంటాయని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన, న్యాయాధికారి ఎస్‌ జయలక్ష్మి పేర్కొన్నారు. శనివారం గాండ్లపెంట మండలం కటారుపల్లి కస్తూర్బా పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.

JUDGE: విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలి
Speaking magistrate Jayalakshmi

కదిరిలీగల్‌/గాండ్లపెంట, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ప్రతి విషయంలోనూ విద్యార్థినులు జాగ్రత్తగా మెలిగితే మంచి ఫలితాలు ఉంటాయని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన, న్యాయాధికారి ఎస్‌ జయలక్ష్మి పేర్కొన్నారు. శనివారం గాండ్లపెంట మండలం కటారుపల్లి కస్తూర్బా పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. పోక్సో చట్టంపై నిర్వహించిన సదస్సుకు ప్రిన్సిపాల్‌ దుర్గా అధ్యక్షత వహించగా న్యాయాధికారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. న్యాయాధికారి మాట్లాడుతూ పోక్సో చట్టంపై వివరించారు. సాధారణ చట్టాలపై విద్యార్థికి అవగాహన పెంచడానికే న్యాయవిజ్ఞాన సదస్సులు అని చెప్పారు. అయితే విద్యార్థి దశ నుంచి విద్యపైన శ్రద్ధ పెట్టి విజయం వైపు దృష్టి ఉండాలని స్పష్టం చేశారు. సమాజంలో వికృత చేష్టలు, ఆసభ్యప్రవర్తనలు, గుడ్‌టచ, బ్యాడ్‌టచ అంశాలను తెలుసుకోవాలన్నారు. అలాంటి వారి పట్ల జాగ్రత్త వహించి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మనల్నిమనం కాపాడుకుంటూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఎవరిపైన ఆధారపడకుండా జీవించాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చౌడప్ప, రూరల్‌ సీఐ నాగేంద్ర, గాండ్లపెంట ఇనచార్జి ఎస్‌ఐ వలిబాషా పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 12:05 AM