MUNCIPAL MEET: పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టండి
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:08 AM
పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ సమావేశపు భవనంలో చైర్‌పర్సన కాచర్ల లక్ష్మీ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు.

ధర్మవరం, మార్చి 29(ఆంద్రజ్యోతి): పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ సమావేశపు భవనంలో చైర్‌పర్సన కాచర్ల లక్ష్మీ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. పలువురుకౌన్సిలర్లు ఆయావార్డుల సమస్యలను చైర్మన దృష్టికి తెచ్చారు. కౌన్సిలర్ చందమూరి నారాయణరెడ్డి మాట్లాడుతూ..మున్సిపాలిటీలో ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, అందులో ఎన్ని రిపేరిలో ఉన్నాయి, ఎన్ని పనిచేస్తున్నాయని కమిషనర్ ప్రమోద్‌కుమార్‌ను ప్రశ్నించారు. స్పందించిన కమిషనర్ తాను బాధ్యతలు చేపట్టినప్పుడు 8 ఉండగా అందులో 5 రిపేరిలో ఉన్నాయన్నారు. పట్టణంలో వాటర్ ప్లాంట్లకు అనుమతులు ఉన్నాయా, ట్యాంకులను శుభ్రం చేస్తున్నారా, ఫిల్టర్లు మార్చుతున్నారా అని 9వ వార్డుకౌన్సిలర్ సాయికుమార్ అధికారులను ప్రశ్నించారు. కచ్చితంగా పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ప్లాంట్లను నిర్వహిస్తుంటే చర్యలు తీసుకుంటామన్నారు. లక్ష్మీచెన్నకేశవపురంలో హైమాక్స్ లైట్లు వేయాలని ప్రతి కౌన్సిల్ సమావేశంలో అడుగుతున్నా పట్టించుకోలేదని కౌన్సిలర్‌లు పురుషోత్తంరెడ్డి,మేడాపురం వెంకటేశ అధికారులను ప్రశ్నించగా పండుగ తరువాత అమర్చుతామన్నారు. వైస్‌చైర్మన్లు షేక్ షంషాద్‌బేగం, జయరామిరెడ్డి, కౌన్సిలర్‌లు, టీపీఓ విజయభాస్కర్, ఆర్‌ఐ శివ, శానిటరీ ఇనస్పెక్టర్‌లు శ్యామ్సన, కేశవ, ఏఈ కళావతి పాల్గొన్నారు.