Share News

Himachal Pradesh: జూనియర్‌ని ర్యాగింగ్ చేసిన సీనియర్లు అరెస్ట్

ABN , Publish Date - Sep 11 , 2024 | 03:00 PM

హిమాచల్‌ప్రదేశ్‌ సోలన్ జిల్లాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంబీఏ జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన కేసులో ముగ్గురు సీనియర్ విద్యార్దులను అరెస్ట్ చేసినట్లు మంగళవారం పోలీసులు వెల్లడించారు. ఈ ముగ్గురు విద్యార్థులను యూనివర్సిటీ సైతం బహిష్కరించిందని వారు తెలిపారు.

Himachal Pradesh: జూనియర్‌ని ర్యాగింగ్ చేసిన సీనియర్లు అరెస్ట్

సిమ్లా, సెప్టెంబర్ 1: హిమాచల్‌ప్రదేశ్‌ సోలన్ జిల్లాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంబీఏ జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన కేసులో ముగ్గురు సీనియర్ విద్యార్దులను అరెస్ట్ చేసినట్లు మంగళవారం పోలీసులు వెల్లడించారు. ఈ ముగ్గురు విద్యార్థులను యూనివర్సిటీ సైతం బహిష్కరించిందని తెలిపారు. శనివారం రాత్రి ఎంబీఏ జూనియర్ విద్యార్థి రజిత్ కుమార్‌ రూమ్‌కు సీనియర్ విద్యార్థులు వెళ్లారు. తన రూమ్‌కు రావాలంటూ అతడిని ఆదేశించారు.


అందుకు రజిత్ కుమార్ ససేమిరా అన్నాడు. అతడిని బలవంతంగా తమ రూమ్‌కు సీనియర్లు తీసుకు వెళ్లారు. మద్యం తాగాలంటూ రజిత్ కుమార్‌పై వారు తీవ్ర ఒత్తిడి చేశారు. అందుకు అతడు నిరాకరించాడు. దీంతో సీనియర్లు ఆగ్రహించి.. రజిత్‌ కుమార్‌పై బెల్ట్‌తో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులు కరణ్ డోగ్రా, చిరాగ్ రానా, దివ్యాంశ్‌లపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు.


అంతకుముందు యూనివర్సిటీలోని ర్యాగింగ్ వ్యతిరేక కమిటీని రజిత్ కుమార్ ఆశ్రయించాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కమిటీ.. ఈ ముగ్గురు సీనియర్ విద్యార్థులను యూనివర్సిటీ నుంచి బహిష్కరించింది. మరోవైపు జూనియర్‌పై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ వ్యవహరమంతా సెల్ ఫోన్లో రికార్డు అయింది. అందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 11 , 2024 | 03:15 PM