Ragging: నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:07 AM
తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో ఫస్టియర్ ఇయర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. అతనిపై వికృత చేష్టలకు పాల్పడ్డారు. దీనిపై బాధిత విద్యార్థి కాలేజీ ప్రిన్స్‌పాల్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నాగర్ కర్నూల్ జిల్లా: ప్రభుత్వ మెడికల్ కాలేజీ (Government Medical College)లో ర్యాగింగ్ (Ragging) కలకలం రేపింది. ఈ నెల 25న రాజస్థాన్ (Rajasthan)కు చెందిన మొదటి సంవత్సరం (1st year) చదువుతున్న విద్యార్ధిపై సీనియర్ విద్యార్థులు (Senior Students) ర్యాగింగ్ చేశారు. అతని సెల్‌ఫోన్ (Cell Phone) తీసుకుని వీడియోలు (Videos) సెండ్ చేసుకున్నారని... అనంతరం తనపై దాడి చేశారని పోలీస్ స్టేషన్‌లో బాధిత విద్యార్థి ఫిర్యాదు చేశారు. ఈ ర్యాగింగ్ ఘటనపై కాలేజీ వైస్ ప్రిన్స్‌పాల్ సుగుణ స్పందించారు. ర్యాగింగ్ జరిగింది వాస్తవమేనని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామన్నారు. వచ్చేనెల (ఏప్రిల్) 2న వారితో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ర్యాగింగ్ చేసిన విద్యార్తులకు కౌన్సెలింగ్ నిర్వహించామని, మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రిన్స్‌పాల్ సుగుణ తెలిపారు.
Also Read..: ఇలా చేస్తే కూలర్ క్షణాల్లో పని చేస్తుంది..
తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో ఫస్టియర్ ఇయర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. అతనిపై వికృత చేష్టలకు పాల్పడ్డారు. దీనిపై బాధిత విద్యార్థి కాలేజీ ప్రిన్స్‌పాల్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీల్లో చాలా వరకు జరుగుతున్నాయి. అయితే బయటకు రావడంలేదు. ఈ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్ధి ధైర్యం చేసి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గోప్యంగా ఉంచేందుకు యత్నించినప్పటికీ.. వెలుగులోకి వచ్చింది. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.
బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తనకు మెడికల్ కాలేజీ హాస్టల్‌కు తీసుకెళ్లి ర్యాగింగ్ చేశారని.. గోడ కుర్చీ వేయించడంతోపాటు.. లేని గ్యాస్ సిలిండర్‌ను ఉన్నట్లు ఫీలవుతూ మోయాలని అవహేళన చేసినట్లు తెలిపాడు. అయితే.. సీనియర్ల టాస్క్‌ను మధ్యలో ఆపేసినందుకు లెదర్ బెల్ట్‌తో దాడి చేశారని వెల్లడించాడు. ముఖంపై పిడిగుద్దులు గుద్దడంతో నోటి నుంచి రక్తం బయటకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు.. మొబైల్ ఫోన్ లాక్కొని పర్సనల్ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకొని తనను బ్లాక్ మెయిల్ చేశారని విద్యార్థి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం సంచలనం సృష్టించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మెడికల్ కాలేజ్‌కు వెళ్లి ఆరా తీశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉగాది పచ్చడి వెనుక రహస్యం ఇదే..
ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం..
తెలుగుదేశం 43వ ఆవిర్భావ దినోత్సవం
For More AP News and Telugu News