Home » Raghurama krishnam raju
తనను శాశ్వతంగా నియోజకవర్గం నుంచి దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. భీమవరంలోని కూటమి క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో రఘురామ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నా ఆ మరుక్షణమే తన ఎంపీ సీటు పోతుందన్నారు. మాట్లాడించుకున్నన్ని రోజులు మాట్లాడించుని.. ఇప్పుడు సభ్యత్వం లేదంటున్నారని రఘురామ వాపోయారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణం రాజు(Raghu Rama Krishna Raju) స్పష్టం చేశారు. బుధవారం నాడు విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి పంచహారతుల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై కారణాలు తెలపాలని సీబీఐని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. రఘురామ పిటిషన్ల పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది.
నేడు జగన్ బెయిల్ రద్దు పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.రఘురామ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా రఘురామ మరో పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకొంది. ఏప్రిల్ 1వ తేదీన వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నాయకుడు రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజుకు బీజేపీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు తామే అవకాశమివ్వాలని టీడీపీ నాయకత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది.
పీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు వాళ్ల పేటీఎం బ్యాచ్‌తో అసభ్యంగా బెదిరిస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు(Raghurama Krishna Raju) అన్నారు. బుధవారం నాడు ఢిల్లీ వేదికగా ఎంపీ రఘురామ మీడియాతో మాట్లాడుతూ..తన దగ్గర కూడా సజ్జల, పిల్ల సజ్జల, ఇతరుల నంబర్స్ ఉన్నాయని.. తాను కూడా అలా చేయొచ్చని అన్నారు.
ఏపీలో15వ తేదీ లోపు ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని.. తన దగ్గర సమాచారం ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు(MP Raghurama Krishnamraju) అన్నారు. ప్రజలు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్నారని చెప్పారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్రంలో పోలీసుల అకృత్యాలు పెరిగిపోయాయని.. పోలీసుల దాడులను ప్రజలు తట్టుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పారు.
ప్రధాన మంత్రి మోదీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టడంపై లేఖలో ప్రస్తావించారు. ఎన్నడూ లేని విధంగా రూ.350 కోట్లకు సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టేశారన్నారు. ప్రధానమంత్రిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసే లోపే తాను లేఖ రాశానన్నారు. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగం ఉల్లంఘనలు చేస్తోందని దీనిపై విచారణ చేయాలని కోరానన్నారు.
నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో క్లారిటీ కోసం తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ సర్వేను చేపడుతోంది. ఆ సర్వేలో పార్టీ అభ్యర్థిత్వానికి టీడీపీ పరిశీలిస్తున్న వ్యక్తుల జాబితాలో రఘురామ కృష్ణరాజు పేరు వినిపిస్తోంది. నర్సాపురం నుంచి రఘురామ ‘ఓకే అయితే 1 నొక్కండి’ అని వాయిస్ వినిపిస్తోంది. దీంతో ఆయనను నర్సాపురం బరిలో దింపడం దాదాపు ఖాయమైనట్టేనని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.