Home » Rajahmundry
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారని..
ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు చర్చంతా చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరు ఉండబోతున్నారు.. అనుభవానికి పెద్దపీట వేస్తారా.. యువతకు అవకాశాలు ఇస్తారా అనే చర్చ సాగుతోంది.
ఏపీ శాసనసభ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదలైంది. రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఘన విజయం సాధించారు. 60వేలకు పైగా ఓట్ల మెజార్టీతో బుచ్చయ్యచౌదరి విజయం సాధించారు.
ఏపీ ఓటర్ల తీర్పు వన్‌సైడ్‌గా ఉన్నట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యం కనబర్చగా.. ఈవీఎంల కౌంటింగ్ తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు మొదటి రౌండ్లో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.
కౌంట్‌డౌన్ మొదలైంది. ఇక కేవలం ఆరు రోజులు మాత్రమే. ఈనెల 13 తేదీ నుంచి గూడుకట్టుకట్టుకున్న టెన్షన్ అంతా జూన్ 4వ తేదీతో పోతుంది. ఆరోజు అంటే మంగళవారం మధ్యాహ్నానికే ఇంచుమించు ఫలితాలన్నీ తేలి పోతాయి. జిల్లాలోని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు రాజమండ్రి సిటీ, రూర ల్, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడద వోలు, గోపాలపురం నియోజకవర్గాలలో మొత్తం 83 మంది అభ్యర్థులు వివిధ పార్టీల కింద, స్వతంత్రులుగానూ పోటీచేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాన పోటీ టీడీపీ- జనసేన- బీజేపీ కూట మి, వైసీపీ మధ్య ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కూటమి..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై (AP Elections) రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.. ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు అంతే స్పీడ్‌గా ఉన్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వారు బెట్టింగ్‌లు కాస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల మీదే బెట్టింగ్ సాగడం గమనార్హం..
ప్రధాని నరేంద్ర మోదీపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. మోదీ విశ్వజిత్ అని అభిప్రాయ పడ్డారు. విశ్వజిత్ అంటే విశ్వాన్ని జయించిన వారని వివరించారు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా ప్రధాని మోదీ నిలిపారని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ప్రజాగళం సభలో నారా లోకేశ్ మాట్లాడారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార జోరును పెంచాయి. ఏపీలో గెలుపే లక్ష్యంగా కూటమి నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆంధ్రాకు వచ్చారు. రాజమండ్రిలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
Andhrapradesh: రెండవ దశ పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రధాని మోదీలో కాన్ఫిడెన్స్ తగ్గిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీ 200 స్థానాలు కూడా గెలవలేదన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తులో ఉందో తెలియడం లేదన్నారు.
Andhrapradesh: రాజమండ్రిలోని ఆంధ్రా పేపర్ మిల్కు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. గురువారం పేపర్ మిల్లు గేట్లకు యజమాన్యం తాళాలు వేసింది. దీంతో కార్మికులు గేటు బయటే వేచి ఉన్నారు. ఉన్నట్టుండి పేపర్ మిల్కు లాకౌట్ ప్రకటించడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పేపర్ మిల్లు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.