Home » Rajasthan
సగటు దిగువ తరగతి, పేద పౌరులకు ఏసీలు కొనడం అంటే సామాన్య విషయం కాదు. అలాగని మండే ఎండలను అలాగే భరించలేరు కూడా. అలాంటి సమయంలోనే వారిలో ట్యాలెంట్ బయటికొస్తుంది. మండే ఎండలకు చెక్ పెట్టడుతూ రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి సింపుల్ గా ఏసీ తయారుచేశాడు.
సింగిల్ కాట్, డబుల్ కాట్, కింగ్ సైజ్, క్వీన్ సైజ్ బెడ్ల గురించి అందరికీ తెలిసిందే. కానీ ఏకంగా 8 మంది ఒకేసారి నిద్రించేంతటి పెద్ద మంచాలు.. అదీ ఓ కుగ్రామంలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. రాజస్థాన్‌లోని నాగ్లా బంద్ గ్రామంలో ఈ మంచాలు దర్శనమిస్తాయి.
ఏ రాజకీయ పార్టీ అయినా తన సొంత అభ్యర్థికే ఓటు వేయొద్దని ప్రచారం చేస్తుందా? అసలు అలాంటి సందర్భం ఎప్పుడైనా చోటు చేసుకుందా? గతం సంగేతేమో కానీ.. తాజాగా 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అలాంటి విచిత్ర పరిణామం వెలుగు చూసింది. రాజస్థాన్‌లోని గిరిజనులు అధికంగా..
కాంగ్రెస్ హయాంలో 'హనుమాన్ చాలీసా' వినడం కూడా నేరంగా చూసేవారని, ఇందువల్ల రాజస్థా్న్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఏడాది తొలిసారిగా 'రామనవమి' సందర్భంగా రాష్ట్రంలో శోభా యాత్ర ఊరేగింపు జరిగిందని చెప్పారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తే.. నిషేధిత సంస్థలు పాపులర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) వంటి సంస్థలు పునరజ్జీవనం పొందుతాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని.. దీంతో పీఎప్ఐ సంస్థకు రాజస్థాన్‌లోని కోట కేంద్రంగా మారిందని ఆరోపించారు.
మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సాధించిన అద్భుతమైన విజయంలో జోస్ బట్లర్ పాత్ర అత్యంత ప్రధానమైందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. 224 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా.. ఆ జట్టు 14 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 128 పరుగులే చేసినప్పుడు, బట్లర్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ దుమ్ము దులిపేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (56 బంతుల్లో 109) సెంచరీతో శివాలెత్తడం వల్లే.. కేకేఆర్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది.
రాజస్థాన్ లోని చురు-సాలాసర్ హైవేపై ఆదివారంనాడు మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఒక ట్రక్కును వెనుకవైపు నుంచి ఢీకొనడంతో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో కారులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనమయ్యారు.
సాధారణంగా.. ఒక మ్యాచ్‌కి కెప్టెన్ దూరమైనప్పుడు, అతని స్థానంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న ఆటగాడు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అయితే.. ఏప్రిల్ 13వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ దూరమైనప్పుడు, సామ్ కరన్ ఆ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు.
గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ రెండు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఒకట్రెండు మ్యాచ్‌లకు ధవన్ అందుబాటులో ఉండడని ఆ జట్టు క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ సంజయ్ భంగార్ పేర్కొన్నాడు.