Home » Samajwadi Party
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్జప్తి చేశారు. గురువారం లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేజ్రీవాల్‌తోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్ పాల్గొన్నారు.
‘‘పార్టీ తరఫున ఇక్కడ ఎవరిని నిలిపినా గెలిపిస్తాం.. ఈసారి భయ్యాజీ (అన్నయ్య) తిరిగొచ్చిండు. ఇక విజయం మాదే’’.. ఇదీ యూపీలోని కనౌజ్ నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) శ్రేణుల మాట. అత్తరు పరిశ్రమకు పేరుగాంచిన ఈ స్థానం ఎస్పీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు గెలిచింది.
ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ప్రధాన పోరు కొనసాగుతున్న వేళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. బీఎస్పీ అధినేత్రి మాయావతిని టార్గెట్ చేశారు. మరోవైపు అఖిలేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాయావతి. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను మాయావతి తప్పించారు. ఏడాది క్రితం ఇచ్చిన వారసత్వ బాధ్యతల నుంచి కూడా తప్పించినట్లు ప్రకటించారు. దీంతో మాయావతి తీసుకున్న ఈ నిర్ణయంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఢిల్లీలో అధికారంలోకి రావాలంటే యూపీలో గెలవాలి. ఎవరిని అడిగినా ఇదే చెబుతారు. అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఏ పార్టీ ఎక్కువు సీట్లు గెలిస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారానికి దగ్గరవుతుందనేది వాస్తవం. దీంతో ఈ ఎన్నికల్లో యూపీలో సత్తా చాటేందుకు ఎన్డీయే, ఇండియా కూటములు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలుండగా.. మూడు విడతల పోలింగ్ ముగిసింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గడం రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి.
కనౌజ్ లోక్‌సభ అభ్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షడు అఖిలేష్ యాదవ్ స్థానిక సిద్దపీట్ బాబా గౌరీ శంకర్ మహదేవ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
సార్వత్రిక ఎన్నికల మూడోదశలో ఉత్తరప్రదేశ్‌లోని కీలకమైన 10 లోక్‌సభ నియోజకవర్గాలకు మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. అవి సంభల్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, ఫిరోజాబాద్, మెయిన్‌పురి, ఎటా, బదాయూ, బరేలీ, ఆవ్లా నియోజకవర్గాలు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ(BJP) స్పీడ్ పెంచింది. వరుస సభలు, ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మే 5న ఆయన ఉత్తరప్రదేశ్‌లో(UP) ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
రసవత్తర రాజకీయానికి పేరుగాంచిన ఉత్తరప్రదేశ్‌లో మూడో దశలో ఆసక్తికర సమరం జరగనుంది. వారసత్వం, తిరుగుబాట్లు, చిరకాల విరోధుల మధ్య పోటాపోటీ నెలకొంది.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొడుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రాకూండా అడ్డుకట్టవేసేందుకు విపక్ష ఇండియా కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను విడుదల చేయగా.. ఏడు అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది.
దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి విజయపరంపరకు బ్రేక్ వేసేందుకు సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇండియా కూటమిలో భాగ స్వామిగా ఉన్న ఎస్పీ, కాంగ్రెస్, టీఎంసీ కలిసి యూపీలో పోటీ చేస్తున్నారు.