LokSabha Elections: అఖిలేష్ యాదవ్ ప్రత్యేక పూజలు.. ఆలయాన్ని శుద్ది చేసిన బీజేపీ శ్రేణులు
ABN , Publish Date - May 07 , 2024 | 04:12 PM
కనౌజ్ లోక్‌సభ అభ్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షడు అఖిలేష్ యాదవ్ స్థానిక సిద్దపీట్ బాబా గౌరీ శంకర్ మహదేవ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
కనౌజ్, మే 07: కనౌజ్ లోక్‌సభ అభ్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షడు అఖిలేష్ యాదవ్ స్థానిక సిద్దపీట్ బాబా గౌరీ శంకర్ మహదేవ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే ఆయన దేవాలయం నుంచి వెళ్లిన తర్వాత.. బీజేపీ శ్రేణులు ఆ దేవాలయాన్ని గంగా జలంతో శుద్ది చేశాయి. అందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అఖిలేష్ యాదవ్‌తోపాటు పలువురు ముస్లిం నాయకులు.. కాళ్లకు బూట్లు ధరించి దేవాలయ ప్రాంగణంలోకి వచ్చారని బీజేపీ శ్రేణులు ఆరోపించాయి. అందుకే శుద్ది చేసినట్లు వెల్లడించాయి. ఇక కనౌజ్ నగర బీజేపీ అధ్యక్షుడు శివేంద్ర కుమార్ గవాల్ దీనిపై వివరణ ఇచ్చారు. అఖిలేష్ యాదవ్ ఆలయంలోకి వెళ్లితే ఇబ్బంది లేదు. ఎందుకంటే.. అతడు హిందువు అని తెలిపారు. కానీ దేవాలయం బయట.. సనాతనేతరులు ఆలయంలో ప్రవేశం నిషేధం అని బోర్డు తగిలించి ఉందని గుర్తు చేశారు.
AP Elections: పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ.. పట్టించుకోని పోలీసులు...
మరోవైపు ఈ ఘటనపై సమాజవాదీ పార్టీ నాయకుడు ఐపీ సింగ్ స్పందించారు. అఖిలేష్ యాదవ్... వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి అని అందుకే బీజేపీ శ్రేణులు.. ఆ దేవాలయాన్నీ శుద్ధి చేశాయని తెలిపారు. గతంలో ఇదే బీజేపీ శ్రేణులు. లక్నోలోని ముఖ్యమంత్రి బంగ్లాను సైతం గంగా జలంతో శుద్ది చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Loksabha Elections: బీజేపీలో చేరిన శేఖర్ సుమన్, రాధిక
ఇక అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. కనౌజ్ ప్రతి సారి చరిత్ర సృష్టిస్తుందన్నారు. ఈసారి కూడా అదే జరుగుతుందన్నారు. అయితే ఈ ఎన్నికల్లో భారీ ఓట్ల తేడాతో బీజేపీ ఓటమి పాలవుతుందని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.
Read Latest National News and Telugu News