Home » Seethakka
Telangana: గోదావరి నుంచి ఇసుకను తరలించే లారీలను నియంత్రించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అధిక లోడు వచ్చే లారీలతో రోడ్లు మొత్తం గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మేడారం జాతర దృశ్యా ఇసుక లారీల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలిపారు.
‘‘మాది గడిల పాలన కాదు.. గల్లీ బిడ్డల పాలన. మా ప్రభుత్వానికి ప్రజల మద్దతు చూసి బీఆర్ఎస్ నేతలు భయపడి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని మంత్రి సీతక్క ( Minister Seethakka ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు గాంధీభవన్లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ ఫ్యూడల్ పార్టీ అని.. అధికారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు బతకలేకపోతున్నారని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు.
Telangana: జిల్లాలోని జైనథ్ మండలం జామినిలో ప్రజా పాలన కార్యక్రమాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నన్ను మేడం అని పిలవొద్దు. సీతక్క అని పిలవండి. మేడం... మేడం అంటే దూరం అయిపోతము’’...
బీఆర్ఎస్ ( BRS ) పార్టీది విడుదల చేసింది స్వేదపత్రం కాదని స్వాహా పత్రమని మంత్రి సీతక్క ( Minister Seethakka ) ఎధ్దేవా చేసింది. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ...బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఎక్కడ చెమట చిందించారో చెప్పాలని ప్రశ్నించారు. పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని మంత్రి సీతక్క మండిపడ్డారు.
మేడారం జాతర ( Medaram Jatara ) పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి సీతక్క ( Minister Seethakka ) పేర్కొన్నారు. మంగళవారం నాడు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలోమంత్రి సీతక్క పర్యటించారు. గుంజేడు ముసలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీతక్కకు ఆలయ నిర్వాహకులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
హైదరాబాద్: ప్రజా భవన్లో ప్రజావాణి కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.