Share News

Waqf Bill: వక్ఫ్ బిల్లు చారిత్రకం.. ఏక్‌నాథ్ షిండే శివసేన మద్దతు

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:24 PM

వక్ఫ్ బిల్లు బుజ్జగింపు బిల్లు కాదని, అభ్యున్నతి బిల్లు అని ఏక్‌నాథ్ షిండే శివసేన పార్టీ ఎంపీ శ్రీకాంత్ షిండే అన్నారు. ఈ బిల్లు దేశం కోసం ప్రవేశపెట్టిన బిల్లే కానీ నిర్దిష్ట మతానికి వ్యతిరేకంగా తీసుకువచ్చినది కాదని చెప్పారు.

Waqf Bill:  వక్ఫ్ బిల్లు చారిత్రకం.. ఏక్‌నాథ్ షిండే శివసేన మద్దతు

న్యూఢిల్లీ: లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు 2024 (Waqf Amendment Bill)కు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన మద్దతు తెలిపింది. ఇది బుజ్జగింపు (Appeasement) బిల్లు కాదని, అభ్యున్నతి (Upliftment) బిల్లు అని ఆ పార్టీ ఎంపీ శ్రీకాంత్ షిండే అన్నారు. ఈ బిల్లు దేశం కోసం ప్రవేశపెట్టిన బిల్లే కానీ నిర్దిష్ట మతానికి వ్యతిరేకంగా తీసుకువచ్చినది కాదని చెప్పారు.

Waqf Bill: ఓట్లతో వ్యాపారం మానుకోవాలి.. విపక్షాలకు రవిశంకర్ ప్రసాద్ చురకలు


బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా శ్రీకాంత్ షిండే మాట్లాడుతూ, శివసేన తరఫున, తమ నేత ఏక్‌నాథ్ షిండే తరఫున తాను పూర్తిగా ఈ బిల్లును సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పారు. ''ఇది చారిత్రక, కీలకమైన రోజు. మొదట 370వ అధికరణ, ఆ తర్వాత ట్రిపుల్ తలాక్, సీఏఏ, ఇప్పుడు ఈ బిల్లు. దీనిని పేదల సంక్షేమం కోసం సభ ముందుకు తెచ్చారు'' అని అన్నారు.


బాలాసాహెబ్ బతికుంటే..

శివసేన యూబీటీ నేత అర్వింద్ సావంత్ సభలో చేసిన ప్రసంగం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందిని శ్రీకాంత్ షిండే అన్నారు. "నేను యూబీటీని ఒకే ప్రశ్న అడుగుతున్నాను. బాలాసాహెబ్ బతికుంటే ఇదే మాట ఆయనతో చెప్పి ఉండేవారా? దానిని బట్టే ఎవరి ఐడియాలజీతో యూబీటీ వ్యవహరిస్తోందో, బిల్లును వ్యతిరేకిస్తోందో అర్థం చేసుకోవచ్చు. చేసిన తప్పులను సవరించుకునే సువర్ణావకాశం వచ్చినా, చరిత్రను తిరగరాసి తన సిద్ధాంతాలను సజీవం చేసుకునే అవకాశం ఉన్నా తమ ఐడియాలజీకి యూబీటీ పాతర వేసింది. ఈరోజు బాలాసాహెబ్ బతికి ఉంటే యూబీటీ అసమ్మతి నోట్ చూసి ఆవేదనకు గురయ్యేవారు" అని శ్రీకాంత్ షిండే అన్నారు


ఇవి కూడా చదవండి..

Waqf Amendment Bill: బిల్లులో ఒకే మార్పును కోరనున్న టీడీపీ.. అదేమిటంటే

Waqf: అసలేంటీ వక్ఫ్ బిల్లు, విపక్షాల రాద్ధాంతం దేనికి?

Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

For National News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 05:25 PM