Home » Sri Venkateswara University
ఎస్వీయూలో మూడు రోజులుగా నిర్వహించిన ‘యువతరంగ్’ కార్యక్రమం ఆదివారం ముగిసింది. విజేతలకు బహుమతులు అందజేశారు.
ఇటీవల శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో జరిగిన ఒక సెమినార్‌కు విచ్చేసిన కొందరు, ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు ఎనిమిదేళ్లనాడు తుమ్మల నాగేశ్వర రావు ప్రచురించిన పురాణపండ శ్రీనివాస్ ‘పచ్చకర్పూరం’ గ్రంధంలో కొన్ని అంశాల్ని సభాముఖంగా ప్రస్తావించి.. ప్రశంసించడంతో... మరొకసారి ఈ పరమోత్తమమైన గ్రంధం హాట్ టాపిక్ అయ్యింది. ఈ విశేషాన్ని అప్పటికప్పుడు ప్రముఖ రచయిత పురాణపండకు ఫోన్‌లో ఒక ప్రొఫెసర్ తెలియపరిచగా... ‘తిరుమల రంగనాయకమంటపంలో వేదపండితుల మంత్ర ధ్వనుల మధ్య కప్పే శేష వస్త్రం’ ఎలాంటి అనిర్వచనీయ ఆనందానుభూతినిస్తుందో అదే అనుభూతి కలుగుతోందని పురాణపండ సంతోషం వ్యక్తం చేశారు.