Share News

Retirement Age: రిటైర్‌మెంట్ ఏజ్‌పై కేంద్రం కీలక ప్రకటన..

ABN , Publish Date - Mar 19 , 2025 | 07:02 PM

కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఏజ్‌పై కీలక ప్రకటన చేశారు. బుధవారం లోక్ సభకు లిఖితపూర్వక సమాధానాన్ని ఇచ్చారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య రిటైర్‌మెంట్ ఏజ్‌లో ఎందుకు తేడాలు ఉన్నాయన్న దానిపై కూడా స్పందించారు.

Retirement Age: రిటైర్‌మెంట్ ఏజ్‌పై కేంద్రం కీలక ప్రకటన..
Retirement Age

ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఏజ్‌లో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకురానుందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఏజ్‌పై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఏజ్‌లో మార్పులు చేసే ఉద్దేశం లేదని అన్నారు. లోక్‌సభలో సౌగతా రాయ్, గణపతి రాజ్‌కుమార్‌లు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఏజ్‌కు సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఏజ్‌కు సంబంధించి ఏవైనా మార్పులు చేస్తున్నారా?.. ఉద్యోగుల రిటైర్‌మెంట్ ద్వారా ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయడానికి ఏదైనా పాలసీ ఉందా? అని వారు ప్రశ్నించారు.


కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య రిటైర్‌మెంట్ ఏజ్‌లో ఎందుకు తేడాలు ఉన్నాయని వారు అడిగారు. ఈ ప్రశ్నలకు జితేంద్ర సింగ్ బుధవారం లోక్ సభకు లిఖితపూర్వక సమాధానాన్ని ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ ద్వారా ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయడానికి ఎలాంటి పాలసీ లేదని స్పష్టం చేశారు. దానిపై జరుగుతున్న ప్రచారాలను ఆయన ఖండించారు. నేషనల్ కౌన్సిల్ స్టాఫ్ దగ్గరినుంచి రిటైర్‌మెంట్ ఏజ్ మార్పుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదన రాలేదన్నారు. రిటైర్‌మెంట్ ఏజ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య ఉన్న వ్యత్యాసాలపై ఆయన సమాధానం ఇస్తూ.. ‘ కేంద్రం అలాంటి వాటికి సంబంధించిన డేటాను మెయింటేన్ చేయదు.


అది రాష్ట్రానికి సంబంధించింది’ అని అన్నారు. కాగా, ప్రస్తుతం కొన్ని రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఏజ్ 60 సంవత్సరాలుగా ఉంది. మరికొన్ని రంగాల్లో రిటైర్‌మెంట్ ఏజ్ 65 సంవత్సరాల వరకు ఉంది. ఇక, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు సంబంధించి సొంత రిటైర్‌మెంట్ ఏజ్ పాలసీని అమలు చేస్తున్నాయి. డిపార్ట్‌మెంట్స్‌ల వారీగా రిటైర్‌మెంట్ ఏజ్‌లో తేడాలు ఉంటున్నాయి. 2021లో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఏజ్‌లో మార్పులు చేసింది. దాన్ని 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచింది.


ఇవి కూడా చదవండి..

Good News For AP People: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

KGBV: కేజీవీబీ ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం.. ఎప్పటి నుంచంటే..

Central Cabinet Meeting : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Updated Date - Mar 19 , 2025 | 07:08 PM