AC Tips: ఈ టెంపరేచర్ సెట్టింగ్‌తో..మీ ఏసీ పవర్ బిల్ ఆదా..
ABN , Publish Date - Mar 19 , 2025 | 08:27 PM
సమ్మర్ వచ్చేసింది. ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక మంది వారి ఇళ్లలో ACలను విరివిగా వాడుతుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీ ఏసీ పవర్ తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.

వేసవి కాలం రానే వచ్చింది. దీంతో ఏసీలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే అనేక మంది ఏసీలు తీసుకుంటారు. కానీ వీటి నిర్వహణ విషయంలో మాత్రం పలు జాగ్రత్తలు పాటించడం మర్చిపోతారు. అలా కాకుండా కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మీ ఏసీ పవర్ బిల్ తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏసీని సరైన సెట్టింగ్‌తో అమర్చుకుంటే మీ ఖర్చులు తగ్గుతాయని అంటున్నారు.
సరైన స్థాయిలో
మీ ACని ఎంత ఎక్కువగా నడిపిస్తే, విద్యుత్ ఖర్చులు అంత పెరుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఏసీ వాడకం ద్వారా కూడా మీ బిల్లులను తగ్గించే మార్గాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మీ AC ఉష్ణోగ్రతను సరైన స్థాయిలో సెట్ చేయడం వల్ల మీ విద్యుత్ బిల్లు కొంతమేర తగ్గుతుందన్నారు. మీరు వినియోగించే AC మోడల్, వాటి స్టార్ రేటింగ్స్, ఎఫిషియన్సీ వంటి అనేక అంశాలు కూడా దీనిని ప్రభావితం చేస్తాయన్నారు.
విద్యుత్ బిల్లును తగ్గించే మార్గం
మీ AC ఉష్ణోగ్రత సెట్టింగ్‌ను 24 డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్ చేయడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చని అంటున్నారు. భారత ప్రభుత్వానకి చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ఈ సిఫారసు చేసింది. దీంతో మీరు మీ ACని 24 డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్ చేసినప్పుడు, మీరు సమర్థవంతంగా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. ఈ సెట్టింగ్ చాలా AC యూనిట్లకు డిఫాల్ట్ సెట్టింగ్‌గా వస్తుంది.
ఏసీ ఉష్ణోగ్రత విద్యుత్ బిల్లుల సంబంధం
మీరు మీ ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా సెట్ చేస్తే, అది మీ విద్యుత్ బిల్లును పెంచుతుంది. మీరు ACని 1 డిగ్రీ సెల్సియస్ చల్లగా సెట్ చేసినప్పుడు, మీ విద్యుత్ ఖర్చులు సుమారు 10-12 శాతం పెరిగిపోతాయి. అంటే, మీరు 24 డిగ్రీల సెల్సియస్ బదులు 22 లేదా 20 డిగ్రీలకు సెట్ చేసుకుంటే, అది మీ బిల్లును భారీగా పెంచుతుంది.
తక్కువ ఖర్చు, ఎక్కువ సౌకర్యం
ఏసీ పని సమర్ధతను పెంచడం కూడా మీ విద్యుత్ బిల్లును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఎంచుకునే AC మోడల్, దాని స్టార్ రేటింగ్ కూడా చాలా ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. ఈ స్టార్ రేటింగ్ యూనిట్ ఎంత విద్యుత్ వినియోగిస్తుందో తెలియజేస్తుంది. మీరు 5-స్టార్ AC యూనిట్‌ను తీసుకుంటే, అది 3-స్టార్ యూనిట్‌తో పోలిస్తే చాలా తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. 5-స్టార్ AC యూనిట్ వాడటం వల్ల మీ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి.
ఇవి కూడా చదవండి:
Credit Card: ఓర్నీ..క్రెడిట్ కార్డ్ వద్దని బ్లాక్ చేసినా సిబిల్ స్కోర్ తగ్గుతుందా..
Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..
Credit Score: మీ క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించినా..సిబిల్ స్కోర్ తగ్గుతుందా, ఇలా చేయండి
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News