Home » Tanikella Bharani
చాలా కాలం తరువాత రవీంద్రభారతి ఆడిటోరియమ్ లో ఆబాలగోపాలం ఈ కూచిపూడి నృత్యోత్సవంను ఒక అద్భుత ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. తనికెళ్ళ భరణి సెంటర్ ఎట్రాక్షన్ కాగా, సభల్లో ఎక్కువ పాల్గొనడానికి ఆసక్తి చూపని అసాధారణ వక్త పురాణపండ శ్రీనివాస్ అకస్మాత్తుగా తన పరిమళపు పలకరింపును ఈ వేదికపై దర్శింపచేయడం మేధోవర్గాన్ని ఆశ్చర్యంతోపాటు ఆనందానికి గురిచేయడం ఒక విశేషంగానే చెప్పాలి.
వినూత్న ఆలోచనలతోనే అద్భుత ఆవిష్కరణలు సాధ్యమవుతాయని సైయంట్ టెక్నాలజీస్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని అనంతసాగర్‌లో ఉన్న ఎస్సార్ యూనివర్సిటీ క్యాంప్‌సలో శనివారం ద్వితీయ స్నాతకోత్సవ వేడుకలు జరిగాయి.
స్వప్నాలకీ.. సత్యాలకీ మధ్య, చినుకులకీ.. ఆశలకీమధ్య, ఆహార నిరీక్షణలకీ.. ఆనందోత్సాహాలకీ మధ్య ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఒక ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ సుమ కనకాల, ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ చేసిన సందడి వందలమందిని ఆకర్షించి ఆకట్టుకుంది. ఒక ఫుడ్ ఫెస్టివల్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సుమ అక్కడి మహిళలతో, యువతీ యువకులతో చేసిన ఉత్సాహవంతమైన సందడి ఎంతోమందిని సంతోషంలో ముంచెత్తింది.
శివాజ్ఞ, శివానుగ్రహంతోనే ఈ జగత్తు నడుస్తుందని.. ‘ఆట కదరా శివా’తో లక్షలకొలదీ అభిమానుల్ని సంపాదించుకున్న విఖ్యాత రచయిత, ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భరణి దంపతులకు ఆలయ సంప్రదాయానుసారం వేదపండితులు ఆశీర్వచనం చేసి మన్త్రమయ జ్ఞాపికలుగా ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంధాలను అందజేశారు.