పంపా.. బెంగతీరేనప్పా?
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:57 AM
పంపా రిజర్వాయరుకు ఎట్టకేలకు మంచి రోజులు వచ్చాయి. ప్రభుత్వం చొరవతో త్వరలో ప్రాజెక్టుకు కష్టాలు తీరనున్నాయి. పాడైపోయిన గేట్ల స్థానంలో అన్నీ కొత్తవి అమరనున్నాయి. ఈ ప్రాజెక్టు గేట్లు పూర్తిగా తుప్పు పట్టి ఏళ్లకు ఏళ్లు అయినా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకో లేదు. అత్యవసరంగా గేట్లకు మరమ్మతులు చే యాలని అధికారులు నిధులు అడిగితే కనీసం ఖాతరు చేయలేదు.

-పంపా రిజర్వాయరుకు ఇన్నేళ్లకు మంచి రోజులు
-మొత్తం గేట్లన్నీ కొత్తవి బిగించడానికి ప్రభుత్వం నిర్ణయం
-రూ.2.82కోట్లతో ప్రాజెక్టును బలోపేతం చేయడానికి టెండర్ల ఆహ్వానం
-గతంలో తుఫాను ధాటికి విరిగిపోయిన గేట్లు: 60ఏళ్ల దాటడంతో మిగిలినవీ తుప్పు
-వీటిని ఆధునికీకరించాలని నిధులడిగితే రూ.5లక్షలు విదిల్చిన గత జగన్ సర్కారు
-దీంతో నిధులు లేక దెబ్బతిన్న గేట్లను పూర్తిగా మూసేసిన అధికారులు
-ఇప్పుడు ఏకంగా అన్ని గేట్లు కొత్తవి బిగించడానికి ప్రభుత్వం ఆదేశాలు
-రూ.150కోట్లు ఖర్చయ్యే ఆధునికీకరణ కోసం రైతన్నల ఎదురుచూపులు
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
పంపా రిజర్వాయరుకు ఎట్టకేలకు మంచి రోజులు వచ్చాయి. ప్రభుత్వం చొరవతో త్వరలో ప్రాజెక్టుకు కష్టాలు తీరనున్నాయి. పాడైపోయిన గేట్ల స్థానంలో అన్నీ కొత్తవి అమరనున్నాయి. ఈ ప్రాజెక్టు గేట్లు పూర్తిగా తుప్పు పట్టి ఏళ్లకు ఏళ్లు అయినా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకో లేదు. అత్యవసరంగా గేట్లకు మరమ్మతులు చే యాలని అధికారులు నిధులు అడిగితే కనీసం ఖాతరు చేయలేదు. దీంతో పంపా రిజర్వాయరు కు వరదనీరు వస్తే దిగువనున్న గ్రామాలు బిక్కుబిక్కుమనాల్సిన పరిస్థితి. అధికారులు ప్రమాదం జరగకుండా కొన్నిగేట్లు శాశ్వతంగా మూసే శారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంపా రిజర్వాయరు కష్టాలు తీర్చేలా ఏకంగా రూ.2.82కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. వీటితో త్వరలో అయిదు కొత్త గేట్లను అమర్చనున్నారు.
నాడు అలా.. ఇప్పుడిలా..
ప్రత్తిపాడునియోజకవర్గం శంఖవరం మండ లంలో విస్తరించిన పంపా రిజర్వాయరును 1964లో నిర్మించారు. 105అడుగుల నీటి నిల్వ సామర్ధ్యంతో కూడిన ప్రాజెక్టుకు దిగువున తుని, శంఖవరం, తొండంగి మండలాల పరిధిలోని 14 గ్రామాల్లో 12వేల ఎకరాలకు దీనిద్వారా సాగు నీరు అందుతుంది. ఎగువన రౌతులపూడితోపాటు ఏజెన్సీ ప్రాంతాలనుంచి రిజర్వాయరులోకి ఏటా వర్షాకాలం సమయంలో భారీగా నీరు వ చ్చి చేరుతుంది. గత వైసీపీ ప్రభుత్వం సమ యంలో భారీ తుఫానుకు ప్రాజెక్టుకున్న గేట్లలో ఒకటి పూర్తిగా విరిగిపోయింది. నిర్వహణ కొర వడి పూర్తిగా తుప్పుపట్టేసింది. దీంతో దిగువ గ్రామాలకు పెనుముప్పు పొంచి ఉండడంతో అప్పటికప్పుడు అధికారులు ఆ గేటుకు మరమ్మ తు చేయడం సాధ్యం కాక గడ్డర్లు అడ్డంపెట్టి పూర్తిగా మూసేశారు. ఆ తర్వాత మిగిలిన గేట్లు పరిశీలించి చూస్తే అవి కూడా పూర్తిగా తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ఈనేపథ్యంలో అన్ని గేట్లు బలహీనంగా మారడంతో వీటికి అత్యవసరంగా మరమ్మతు చేయడం, ఆ తర్వాత వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉందని ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. రూ.కోటిన్నర వరకు మంజూరు చేస్తే అత్యవ సర పనులు చేస్తామన్నారు. కానీ అప్పటి జగన్ సర్కారు కేవలం రూ.5లక్షలే మంజూరు చేసిం ది. ఇవి ఏమూలకూ రాకపోవడంతో అధికారులు తూతూమంత్రంగా పనులు కానిచ్చేశారు. ఇ టీవల ఏలేరుకు వరదలు వచ్చిన సమయంలో పంపా రిజర్వాయరుకు భారీగా వరద వచ్చింది. ప్రాజెక్టులో గరిష్ఠంగా 50వేల క్యూసెక్కుల నీరు మాత్రమే నిల్వచేసే సామర్ధ్యం ఉండగా, అంత కుమించి రావడం, అటు గేట్లు పూర్తిగా తుప్పు పట్టడంతో అధికారులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పంపా రిజర్వాయరు కష్టాలు తీర్చాలని నిర్ణయించింది. పాడైపోయిన అయిదు గేట్లను తీసేసి కొత్తగా అన్నీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిం చింది. ఇందుకు రూ.2.82కోట్లు మంజూరు చే సింది. దీంతో అధికారులు తాజాగా ఈ పనుల కు టెండర్లు పిలిచారు. ఏప్రిల్ 2 వరకు టెండర్ల దాఖలుకు గడువు విధించారు. ప్రస్తుతం గేట్లు 15అడుగుల ఎత్తు, 40అడుగుల వెడల్పుతో ఉ న్నాయి. వీటిస్థానంలో అధునాతన గేట్లను మ రింత అదనపు సామర్ధ్యంతో అమర్చనున్నారు.
ఆధునికీకరణపై ఆశలెన్నో..
పంపా రిజర్వాయరు ఆధునికీకరణపై రైతులు ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. 1964లో రిజర్వాయరు రాతికట్టుతో నిర్మించడంవల్ల పటు త్వం తగ్గింది. దీంతో కాంక్రీట్‌తో నిర్మాణం జర గాల్సిఉంది. 2022లో కేంద్ర జలవనరుల శాఖకు చెందిన డ్యాం సేఫ్టీ అధికారుల బృందం ప్రాజె క్టును పరిశీలించింది. ప్రాజెక్టు ఆయకట్టు సామర్థ్యాన్ని 1.25లక్షల ఎకరాలకు పెంచాలని దిశానిర్దేశం చేసింది. కాలువల సామర్ధ్యం పెంచాలని సూచించింది. కానీ ఆ తర్వాత ఆ ప్రతిపాదనలు పక్కకుపోయాయు. రిజర్వాయరులో పూడిక పేరుకుపోయింది. దీన్ని తొలగించి 30ఏళ్లు దా టుతోంది. దీంతో నీటి నిల్వ సామర్ధ్యం కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఇవన్నీ పట్టా లెక్కించి ప్రాజెక్టును ఆధునికీకరిచాలంటే రూ.150కోట్ల వరకు ఖర్చు కానుంది.