Share News

Hydraulic Excavators : శ్రీసిటీలో కోబెల్కో ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:49 AM

నిర్మాణ రంగ దిగ్గజం కోబెల్కో కన్‌స్ట్రక్షన్‌ ఎక్వి్‌పమెంట్‌ ఇండియా కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో పరిశోధన..

 Hydraulic Excavators : శ్రీసిటీలో కోబెల్కో ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నిర్మాణ రంగ దిగ్గజం కోబెల్కో కన్‌స్ట్రక్షన్‌ ఎక్వి్‌పమెంట్‌ ఇండియా కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో పరిశోధన, అభివృద్ధి కేంద్రం (ఆర్‌ అండ్‌ డీ) ఏర్పాటు చేయనుంది. భారత్‌ను జపాన్‌లోని తమ మాతృసంస్థ కోబెల్కో కన్‌స్ట్రక్షన్‌ మెషినరీ కంపెనీకి కీలక తయారీ, ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చి దిద్దాలనుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ కేంద్రం అడ్వాన్స్‌డ్‌ ఇంజనీరింగ్‌ సొల్యూషన్లు, విభిన్న మార్కెట్‌ అవసరాలకు దీటుగా కస్టమైజేషన్‌, కీలక తయారీ కేంద్రంగా భారత్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంపై కృషి చేస్తుందని కంపెనీ తెలిపింది.


చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీసిటీలోఈ కంపెనీ హైడ్రాలిక్‌ ఎస్కవేటర్ల తయారీ కేంద్రం నడుపుతోంది. శుక్రవారం ఈ కేంద్రం 20 వేల ఎస్కవేటర్ల తయారీ మైలురాయిని చేరింది. ఏడాదికి 3,000 ఎస్కవేటర్ల తయారీ సామర్థ్యం గల ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తులను 16 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

Updated Date - Mar 22 , 2025 | 12:50 AM