Home » TDP - Janasena
వైసీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు చేపట్టిన ఉపాధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు కూటమి సర్కారులోని కొంత మంది అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. హడావుడిగా బిల్లుల చెల్లింపునకు ఫైళ్లు సిద్ధం చేశారు.
వయనాడ్ బాధితులకు మేమున్నామంటూ ఏపీ సర్కార్(AP Govt) ముందుకు వచ్చింది. కేరళ వయనాడ్ బాధిత కుటుంబాల కోసం ఏకంగా రూ.10కోట్ల విరాళాన్ని అందజేసేందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) సర్కార్ నిర్ణయించింది.
గత వైసీపీ పాలనలో అన్నివిధాలా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చెప్పారు. మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు.
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం తనకు ఉన్న అధికారాలతో ప్రతిపక్ష నాయకులపై, సామాన్యులపై ఎడాపెడా దొంగకేసులు పెట్టింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని సమీక్షిస్తుందనగానే, జగన్ రోతపత్రిక ఉలిక్కిపడుతోంది.
సకాలంలో కౌంటర్లు వేయకుండా జాప్యం చేస్తే ఇకపై ఖర్చులు విధిస్తామని అధికారులను హైకోర్టు హెచ్చరించింది. వివిధ వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేసేందుకు తగిన సమయం ఇస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది.
‘ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే’ అన్నది సూపర్ స్టార్ రజినీకాంత్ ‘బాషా’లోని ఓ ఫేమస్ డైలాగ్. ‘వంద మంది ఆర్టీఐ దరఖాస్తులు పెట్టుకున్నా... ఒక్కదానికీ జవాబు చెప్పం’ అన్నది రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ బాషా తీరు! వైసీపీ హయాంలో ‘సమాచార హక్కు చట్టం’ ఉండీ లేనట్లుగా తయారైంది.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గురువారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది.
అవయవ దానంతో పలువురికి జీవదాతలుగా నిలిచిన వారి పార్థివ దేహాలకు గౌరవప్రదమైన వీడ్కోలు తెలిపాలని, వారి అంతియ యాత్రను రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో మళ్లీ జన్మభూమి కార్యక్రమం చేపట్టాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. పేదరిక నిర్మూలనకు పీ4 విధానాలను అమలు చేయాలని నిశ్చయించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు.
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గత ఐదేళ్లూ ఉపాధి హామీ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో కేంద్ర అధికారుల వద్ద మన అధికారులు తలవంచుకోవాల్సిన పరిస్థితి!