Home » Telangana Govt
Telangana: తెలంగాణ రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే రైతు భరోసాకు అవసరమైన నిధులను సమకూర్చుకుంది సర్కార్. సంక్రాంతి పండుగ నుంచి రైతులు ఖాతాల్లో ఎకరానికి రూ.7500ల చొప్పున రైతు భరోసాను అందించేందుకు సిద్ధమైంది. రైతు భరోసాకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేయడంపై దృష్టి సారించిన సర్కార్..
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ పి ఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది.
లగచర్లలో భూ సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. లగుచర్ల, పోలేపల్లి, హకీంపేట పరిధిలో ఫార్మా విలేజ్ స్థానంలో మల్టిపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సర్కార్ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమిని సమీకరించనున్నట్లు నోటిఫికేషన్లో తెలియజేసింది.
Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓ ప్రాజెక్ట్‌కు సంబంధించి గత ప్రభుత్వంలో తీసుకున్న కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ బుధవారం జీవో జారీ అయ్యింది. మెఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చిన ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్మెంట్ ఇంజనీరింగ్ విభాగం జీవో జారీ చేసింది.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా కులగణన ప్రారంభమైంది. బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణను ప్రారంభించారు. ఈరోజు నుంచి మొదటి రెండు రోజులు ఇంటింటికి వెళ్లి సర్వే సమాచారాన్ని సిబ్బంది ఇవ్వనున్నారు. ఆ తరువాత నవంబర్ 9 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మొదలుకానుంది.
Telangana: తెలంగాణ ప్రభుత్వంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పల్లె ప్రగతి నిధులను దారి మళ్లించారని మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు కావాలని కానీ.. కేంద్ర పేరు చెప్పేందుకు మాత్రం మనసు రాదంటూ వ్యాఖ్యలు చేశారు.
Telangana: రాష్ట్రంలో హైడ్రా ఏర్పాటై నేటికి వందరోజులు పూర్తి అయ్యింది. ఈ వందరోజుల్లో ఎన్నో అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. అలాగే హైడ్రాకు ప్రభుత్వం కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేయడంతో ఇక తిరుగేలేకుండా పోయింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది.
Telangana: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తోంది. సియోల్ నగరంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎమ్‌ఏపీఓ రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను మంత్రులు, అధికారులు సందర్శించారు. అనంతరం చియంగ్ చు నదిని ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది.
తెలంగాణ సర్కార్ మద్యం ధరల పెంపునకు సిద్ధమైనట్లు సమాచారం. సాధారణంగా బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను ప్రభుత్వం ప్రతి రెండేళ్లకొకసారి పెంచుతుంది. అలాగే ఈసారి వివిధ రకాల మద్యంపై రూ. 20 నుంచి రూ. 150 పెంచాలని ప్రభుత్వాన్ని బ్రూవరీలు కోరాయి.
గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే పవర్ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది. జీహెచ్ఎంసీ చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖ. 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచనుంది.. ఇక నుంచి జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారు.