Home » Telangana Govt
తెలంగాణలో దసరానాడు ముక్క, సుక్క లేకుండా పండగ పూర్తి కాదు. ఏటా బతుకమ్మ, దసరా సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి.
Telangana: రాజకీయ నాయకులు పరుశపదజాలం వాడడం బాధాకరమని మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి అన్నారు. కొందరు ఇష్టమున్నట్టు మాట్లాడితే తనలాంటి వాడికి ఇబ్బందిగా ఉందన్నారు. సోషల్ మీడియాలో వాడే పదజాలం పద్ధతిగా ఉండాలని సూచించారు.
Telangana: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన హైడ్రా ఆర్డినెన్స్‌కు గర్నవర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. హైడ్రా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన..
Telangana: ఖాళీ చేసిన ఇళ్లను ఇప్పటి వరకు అధికారులు కూల్చివేశారు. అయితే కొంతమంది బాధితులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించినప్పటికీ ఖాళీ చేయని పరిస్థితి. హైదరాబాద్ శివారులో డబుల్ బెడ్రూంలు కేటాయించారని.. ఒక్కో ఇంట్లో 16 మంది ఉన్న వారికి డబుల్ బెడ్ రూంలు ఏం సరిపోతాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Telangana: మెడికల్ అడ్మిషన్లకు స్థానికత వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ శాశ్వత నివాసులు రాష్ట్రం బయట చదువుకున్నంత మాత్రాన స్థానిక రిజర్వేషన్ వర్తించదన్న ప్రభుత్వ నిబంధనను కొట్టివేస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
Telangana: ములుగు జిల్లా మేడారం అడవుల్లో ఘోర విపత్తుపై ఎన్ఆర్ఎస్సీ, వాతావరణ శాఖ విచారణ చేపట్టింది. అడవుల్లో వాతావరణ పరిస్థితులను ఎన్ఆర్ఎస్సీ నమోదు చేసుకుంది. 2018 జనవరి 22న మేడారంలోని చిలకల గుట్టలో టోర్నడోలాంటి సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఆనాడు సుడిగాలి ఫోటోలను ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ వీరగోని హరీష్ క్యాప్చర్ చేశారు.
సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చాలా వరకు వచ్చిన జీతంలో కొంత సేవింగ్ చేసి.. ఇల్లు కొంటారు. ఇంకొందరు ప్రభుత్వ సహకారంతో పాటుగా తమ కష్టాన్ని కలుపుకొని ఇంటిని నిర్మించుకుంటారు. అయితే.. అక్కడక్కడ పేదల పరిస్థితి దయనీయంగానే ఉంది.
పారిస్ పారాలింపిక్స్-20024లో సత్తాచాటిన యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆమెకు రూ.కోటి నగదు, గ్రూప్-2 ఉద్యోగంతోపాటు వరంగల్‌లో 500గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Telangana: ములుగు జిల్లా మేడారం అడవుల్లో ఘోర విపత్తుపై ప్రభుత్వానికి అటవీ రక్షణ ప్రధానాధికారి డోబ్రియాల్ని వేదిక ఇచ్చారు. క్లౌడ్ బరస్ట్ వల్లే ఈ విపత్తు సంభవించిందని... మేఘాలు కిందకు వచ్చి బరస్ట్ కావడంతోనే చెట్లు నేలకూలాయని తెలిపారు. 3 కిలోమీటర్ల పొడవు, 2 కిలో మీటర్ల వెడల్పులో 204 హైక్టార్లలో 50వేల చెట్లు కూలాయన్నారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. తెలంగాణలో వరద నష్టం వివరాలు నిర్ణీత ఫార్మాట్లో తక్షణమే పంపాలని కేంద్ర హోమ్ శాఖ సూచించింది. 1345 కోట్ల రూపాయల ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.