Share News

Gutha Sukhender: ప్రభుత్వంపై మండలి చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 09 , 2024 | 01:06 PM

Telangana: రాజకీయ నాయకులు పరుశపదజాలం వాడడం బాధాకరమని మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి అన్నారు. కొందరు ఇష్టమున్నట్టు మాట్లాడితే తనలాంటి వాడికి ఇబ్బందిగా ఉందన్నారు. సోషల్ మీడియాలో వాడే పదజాలం పద్ధతిగా ఉండాలని సూచించారు.

Gutha Sukhender: ప్రభుత్వంపై మండలి చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Council Chairman Guttasukhender Reddy

హైదరాబాద్, అక్టోబర్ 9: కాంగ్రెస్ ప్రభుత్వంపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Council Chairman Guttasukhender Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వనరులు ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం బాగా పని చేస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ చేశారని.. రైతు భరోసా కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్తోందని.. తొందరగా ఇస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులు పరుశపదజాలం వాడడం బాధాకరమన్నారు. కొందరు ఇష్టమున్నట్టు మాట్లాడితే తనలాంటి వాడికి ఇబ్బందిగా ఉందన్నారు. సోషల్ మీడియాలో వాడే పదజాలం పద్ధతిగా ఉండాలని సూచించారు.

CM Revanth: కీలక పరిణామం.. సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి భేటీ


మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడకపోవడం ఆయన ఆటిట్యూడ్ అని.. మాట్లాడడం మాట్లాడకపోవడం కేసీఆర్ ఇష్టమని చెప్పుకొచ్చారు. హైడ్రా విషయంలో ప్లస్ ఆ, మైనస్ ఆ అని లెక్కలు వేయొద్దన్నారు. చంద్రబాబు రోడ్లు విస్తరణ వేసేప్పుడు తిట్టారని... రోడ్డు అయ్యాక మెచ్చుకున్నారని గుర్తుచేశారు. మురికిలో బతుకుతున్న వాళ్ళకి మంచి నివాసాలు ఇవ్వడం మంచిదే కదా అని అన్నారు. చెరువుల దగ్గరికి వెళ్లి ఎన్ని ఇండ్లు అక్రమంగా కట్టారో చూడాలన్నారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది అనడం సరైంది కాదని.. పది నెలల నుంచే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉందని చెప్పుకొచ్చారు.


ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రతిపక్షం బాధ్యతగా సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. కొన్ని విమర్శలు చూస్తే వ్యక్తిగత కక్షతో చేసినట్టు కనిపిస్తోందన్నారు. 88 మంది వచ్చిన వాళ్ళు కూడా పూర్తి కేబినెట్‌ ఎందుకు వేయలేదని కేసీఆర్‌ను అడగాలన్నారు. సంవత్సరాలు నడిచిన కమిషన్లు, ఎంక్వయిరీ కమిటీలు ఉన్నాయని... మూడు నెలలకే కమిటీ ఏమైంది అనడం హాస్యాస్పదమంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఇంత కాస్ట్లీ కావడానికి అన్ని పార్టీలు కారణమన్నారు. ‘‘నువ్వు సుద్ద పూసవైతే ఎదుటివాడ్ని విమర్శించు. టీఆర్ఎస్ పార్టీకి ఖాతా తెరవడానికి డబ్బులు లేకుండే. ఇప్పుడు 1500 కోట్లు ఉన్నాయని వారే ప్రకటించారు. రాజకీయ నాయకుల లూప్ హోల్స్ అధికారులకు తెలుసు. అధికారులు పర్మినెంట్, నేతలు టెంపరరీ’’ అంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కామెంట్స్ చేశారు.

Majority Votes in Haryana: హర్యానాలో మెజార్టీపై అదంతా అబద్ధం.. ఇదే నిజం


మండలి చీఫ్ విప్‌పై ఇలా...

మరోవైపు శాసనమండలి చీఫ్ విప్‌గా పట్నం మహేందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చీఫ్ విప్‌పై మండలి చైర్మన్ పలు వ్యాఖ్యలు చేశారు. మహేందర్ రెడ్డిని బీఆర్ఎస్ విప్‌గా చూడాలా? కాంగ్రెస్ విప్ గా చూడాలా అని మీడియా ప్రశ్నించగా... మహేందర్ రెడ్డిని అఫిషియల్ విప్‌గా చూడాలని మండలి చైర్మన్ తెలిపారు. ‘‘నేను బీఆర్ఎస్ మండలి చైర్మన్‌ను కాదు.. మండలి చైర్మన్ పదవి తీసుకున్నాక నాకు ఏ పార్టీ ఉండదు’’ అని గుత్త సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Pawan Kalyan: కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం..

NRI: వైభవంగా టీపాడ్‌ బతుకమ్మ, దసరా వేడుకలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 09 , 2024 | 01:35 PM